రెండు సీట్లలలో ఓడిపోతే..ప్రభుత్వం పడిపోతుందా ? – హరీష్ రావు

రెండు సీట్లు ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుందా ? ఇది తాత్కాలికంగా బాగానే అనిపించినా..దీర్ఘాకాలికంగా కనిపించదన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు.

రెండు సీట్లలలో ఓడిపోతే..ప్రభుత్వం పడిపోతుందా ? – హరీష్ రావు

MLC Election

Harish Rao : రెండు సీట్లు ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుందా ? ఇది తాత్కాలికంగా బాగానే అనిపించినా..దీర్ఘాకాలికంగా కనిపించదన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కోతలే తప్ప..ఇచ్చిందేమీ లేదు..మోడీ ప్రభుత్వంలోనే జీడీపీ క్షీణించిందన్నారు. పెరిగిన ధరలతో బీజేపీ ప్రభావం మసకబారిందన్నారు. గత ఏడు సంవత్సరాల్లో తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారాయన. రాష్ట్రంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి హరీష్ రావుతో 10tv ముచ్చటించింది. ఈ సందర్భంగా..కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారాయన.

బీజేపీ పట్ల రైతులు సుముఖగా లేరని, లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ప్రజల్లో బీజేపీ విధానాలను ఎండగడుతామని, రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఖచ్చితంగా గెలుస్తామని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. గెలవడం కోసం పీఆర్సీ ప్రకటించారనడం అబద్దమని, మార్చిలో కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది కనుక ఆ విధంగా ప్రభుత్వం చెప్పిందన్నారు. ఉద్యోగాలకు భరోసా సీఎం కేసీఆర్ ఇచ్చారని వెల్లడించారు. ఉపాధ్యాయ, ఉద్యోగాలు సంతృప్తి పడే విధంగా నిర్ణయం ఉంటుందన్నారు.

శాసనమండలిలో తాను మంత్రిగా ఉన్న సమయంలో లక్షా 23 వేలు ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చిందని శాసనమండలిలో చెప్పడం జరిగిందన్నారు. లక్షా 32 వేలు..ఉద్యోగాలు ఇచ్చామని, అందులో రెగ్యులరైజేషన్ కేవలం 15 నుంచి 20 వేలు మాత్రమే.. అది కూడా రెగ్యులరైజ్ కాదన్నారు. లక్షాకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని మరోసారి స్పష్టం చేశారు. 20 వేల పరీక్షలు చేసి..రిజల్ట్స్ దశలో కొన్ని, మరికొన్ని హైకోర్టులో స్టే దశలో ఉన్నాయి..ఖాళీగా ఉన్న ఉద్యోగాల లెక్క ప్రభుత్వం తీస్తోంది అని చెప్పారు మంత్రి హరీష్ రావు.

హైలెట్స్ : –
బీజేపీ ప్రభుత్వం అన్నింటినీ ప్రైవేటు పరం చేస్తోంది..దాని వల్ల రిజర్వేషన్లు పోతాయి.
1.34 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని లెక్కలతో సహా చెప్పాం.
ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టింది బీజేపీ ప్రభుత్వం.

పీవీ గారి శతజయంతి ఉత్సవాలు జరుపుతున్నాం. ఆ కుటుంబానికి గౌరవాన్ని ఇవ్వాలనే వాణీదేవిని నిలబెట్టాం.
వాణీదేవి గారిని గెలిపించి ప్రతిపక్షాల నోళ్లకు తాళం వేస్తాం.
51 శాతానికి పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు టీఆర్ఎస్ సాధిస్తుంది.

100కు పైగా ఎమ్మెల్యేలున్న టీఆర్ఎస్ ప్రభుత్వం..రెండు సీట్లు కోల్పోతే ఎలా పడిపోతుంది ?
విశాఖ ఉక్కు పరిశ్రమతో కేంద్రం ఆగదు. తెలంగాణలోని సంస్థలను కూడా అమ్మేస్తుంది. అందుకే విశాఖ ఉద్యమానికి మద్దతు తెలిపాం.