Harish rao: ప్రజల భాగస్వామ్యంతోనే సిద్ధిపేట అభివృద్ధి: హరీష్ రావు

ప్రజల భాగస్వామ్యంతోనే సిద్ధిపేట జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి హరీష్ రావు. నర్సాపూర్ చెరువు వద్ద భూగర్భ మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాన్ని హరీష్ రావు ప్రారంభించారు.

Harish rao: ప్రజల భాగస్వామ్యంతోనే సిద్ధిపేట అభివృద్ధి: హరీష్ రావు

Harish Rao April17

siddipet: ప్రజల భాగస్వామ్యంతోనే సిద్ధిపేట జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. స్థానిక నర్సాపూర్ చెరువు వద్ద భూగర్భ మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాన్ని హరీష్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతి గురించి వివరించారు. సిద్ధిపేటలో రూ.300 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టామన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఏ ప్రగతి అయినా సాధ్యమవుతుందని చెప్పారు.

Harish Rao On DalitBandhu : త్వరలో అన్ని వర్గాలకు దళితబంధు-హరీశ్ రావు

‘‘సిద్ధిపేటలో దోమలు, ఈగలు లేకుండా అభివృద్ధి చేసుకుంటున్నాం. తడి, పొడి చెత్త సరిగ్గా ఇస్తే సిద్ధిపేట.. ఎప్పటికీ శుద్ధిపేటగా ఉంటుంది. సిద్ధిపేట పేరు లేకుండా రాష్ట్రంలో, కేంద్రంలో అవార్డుల ప్రకటన ఉండటం లేదు. ఈ స్థాయిలో ఆదర్శంగా ఉన్నామంటే అది ప్రజల గొప్పతనం. మన ప్రాంతంలో మండుటెండల్లో చెరువులు మత్తడి పారుతున్నాయి. ఇక్కడి ప్రజలకు నీళ్లకు కొదువ లేదు. కరెంటు బాధలేదు’’ అని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.