Telangana High Court : లాక్ డౌన్ లేదా కర్ఫ్యూపై..నిర్ణయం తీసుకోండి..48 గంటల డెడ్ లైన్, తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

కరోనా వ్యాపించకుండా..ఢిల్లీ ప్రభుత్వం...లాక్ డౌన్ నిర్ణయం తీసుకుందని..మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.

Telangana High Court : లాక్ డౌన్ లేదా కర్ఫ్యూపై..నిర్ణయం తీసుకోండి..48 గంటల డెడ్ లైన్, తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

T High Court

Covid-19 Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి..లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విషయంలో ఏదైనా ఒకటి నిర్ణయం తీసుకోండి…48 గంటల పాటు సమయం ఇస్తున్నాం..ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే..తామే ఆదేశాలిస్తామని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్టీపీసీఆర్ టెస్టుల రిపోర్టులు 24 గంటల్లోగా ఇవ్వాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాపించకుండా..ఢిల్లీ ప్రభుత్వం…లాక్ డౌన్ నిర్ణయం తీసుకుందని..మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సూటిగా ప్రశ్నించింది.

రాష్ట్రంలో ఉన్న సినిమా హాళ్లు, పబ్బుల కఠిన ఆంక్షలు లేకపోవడం పట్ల..హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వేగంగా వ్యాపిస్తుందనే సంగతి తెలిసిందే. రోజు 4 వేల కంటే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టుకు ప్రభుత్వం ఒక నివేదిక సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

చాలా సుదీర్ఘంగా వాదనలు జరిగాయని, ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు ఏకీభవించలేదని న్యాయవాది మాచర్ల రంగయ్య వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో వేగంగా విస్తరించిందని, 90 శాతం కేసులు ఆ నాలుగు జిల్లాల నుంచే ఉన్నాయన్నారు. కుటుంబంలో ఉన్న ముగ్గురికి వైరస్ వ్యాపిస్తే…వారి గురించి ఎలాంటి శద్ధ తీసుకున్నారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించిందని తెలిపారు.

గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని, ఆర్టీపీసీఆర్ రిపోర్టు రావడం వల్ల ఆలస్యం అయిపోతోందని, దీని కారణంగా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని హైకోర్టు వెల్లడించిందన్నారు. ప్రజలకు అప్ డేట్ విషయాలు తెలియచేయాలని, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన వెబ్ సైట్ స్వయంగా హైకోర్టు ఓపెన్ చేసిందన్నారు. తదుపరి విచారణ 23వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించిందని న్యాయవాది తెలిపారు.

Read More : Udyoga Deeksha : షర్మిల ఉద్యోగ దీక్షలో పాల్గొన్న 10 మందికి కరోనా