YS Sharmila: రేపు డిశ్చార్జి చేస్తాం.. వైఎస్‌ షర్మిల ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల

జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వై.ఎస్. షర్మిల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆదివారం రాత్రి లేదంటే సోమవారం ఉదయం డిశ్చార్జ్ చేస్తామని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆమెకు 2 నుంచి మూడు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.

YS Sharmila: రేపు డిశ్చార్జి చేస్తాం.. వైఎస్‌ షర్మిల ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల

YS sharmila

YS Sharmila: అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఆరోగ్యానికి సంబంధించి ఆస్పత్రి వైద్యులు ఆదివారం మధ్యాహ్నం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం షర్మిల ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆమెకు డీహైడ్రేషన్, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఉందని తెలిపారు. తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్, ప్రీ-రీనల్ అజోటెమియా కూడా ఉన్నట్లు బులెటిన్‌లో స్పష్టం చేశారు.

YS Sharmila: వైఎస్ షర్మిల దీక్ష భగ్నం.. అపోలో ఆస్పత్రికి తరలించిన పోలీసులు

షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర వరంగల్ లో ఉధ్రిక్తతకు దారితీసిన విషయం విధితమే.. టీఆర్ఎస్, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో షర్మిల పాదయాత్రను నిలిపివేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే హైదరాబాద్ ఆమె నివాసానికి తరలించారు. దీనిని నిరసిస్తూ షర్మిల, ఆ పార్టీ శ్రేణులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల కారులో వెళ్లగా కారును అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. దీనికి నిరసనగా షర్మిల ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కాగా శనివారం రాత్రి ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు తెలిపారు.

YS Sharmila: క్షీణిస్తున్న షర్మిల ఆరోగ్యం

శనివారం అర్థరాత్రి దాటిన తరువాత పోలీసులు మహిళా కానిస్టేబుళ్లతో వచ్చి షర్మిలను బలవంతంగా జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం డిశ్చార్జ్ చేస్తామని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆమెకు 2 నుంచి మూడు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. వై.ఎస్. షర్మిలను ఆమె తల్లి విజయమ్మ పరామర్శించారు. వైద్యులను అడిగి షర్మిల ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. అపోలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.