సూర్యాపేటలో హృదయ విదారక ఘటన : రోడ్డు పక్కన చనిపోయిన తల్లికి సపర్యలు చేసిన చిన్నారి

సూర్యాపేటలో హృదయ విదారక ఘటన : రోడ్డు పక్కన చనిపోయిన తల్లికి సపర్యలు చేసిన చిన్నారి

Heartbreaking incident in Suryapeta : చావు.. పుట్టుకలంటే తెలియని తనం.. తల్లి చనిపోయింది కూడా తెలియనంత చిన్నతనం.. తన తల్లి చనిపోలేదు.. బతికే ఉందనుకునేంత పసితనం. సూర్యాపేటలో ఓ హృదయవిదారక ఘటన.. అందరినీ కంటతడి పెట్టించింది. తన తల్లి చనిపోయిందని కూడా తెలియని ఆ చిన్నారి.. అక్కడ చేసిన పనులు ప్రతి ఒక్కరిని కలచివేశాయి.

సూర్యాపేట పట్టణంలోని శ్రీశ్రీ నగర్‌లో రోడ్డు పక్కనే ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. ఆమె అనాథా..? లేక ఏదైనా పని కోసం పట్టణానికి వచ్చి మృతి చెందిందో తెలీదు కానీ.. పక్కనే నాలుగేళ్ల పాప ఉంది.

తన తల్లి చనిపోయిందన్న విషయం తెలియని ఆ చిన్నారి.. తల్లి తలలో పేలు చూస్తున్నట్లు చేయడం, మృతదేహంపై ఉన్న దుప్పటి సరిచేయడం వంటి పనులు చేయడం హృదయవిదారకంగా మారాయి.