Heat Wave Warning : తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమన్న భానుడు..!

Heat Wave Warning : వేసవి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగ మండిపోతున్నాడు. మధ్యాహ్నం వడ గాల్పులు దడ పుట్టిస్తున్నాయి.

Heat Wave Warning : తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమన్న భానుడు..!

Heat Wave Warning To Telugu States For Next 4 Days (1)

Heat Wave Warning : వేసవి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగ మండిపోతున్నాడు. మధ్యాహ్నం వడ గాల్పులు దడ పుట్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడు విశ్వరూపం దాల్చుతున్నాడు. ఏప్రిల్ రాకముందే.. మార్చిలోనే మంట పుట్టిస్తున్నాడు. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతో.. ప్రజలు ఎండల వేడి, ఉక్కపోతకు సతమతమవుతున్నారు. ఏపీలో పలు ప్రాంతాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని కొన్నిచోట్ల ఇవాళ కూడా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తాజా బులెటిన్ లో పేర్కొంది. విజయనగరం జిల్లా కొమరాడ, కురుపాం, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని తెలిపింది.

మరో 5 జిల్లాల్లోని మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని వెల్లడించింది. అటు తెలంగాణలోనూ పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా చాప్రాలలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్ల మార్చి ఉష్ణోగ్రతల్లో ఇది కొత్త రికార్డ్‌. ఎల్లుండి వరకు రాష్ట్రంలో సాధారణం కన్నా 3 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. విదర్భ నుంచి కేరళ వరకూ గాలులతో ఉపరితల ద్రోణి 900 మీటర్ల ఎత్తున కొనసాగుతోంది. దీంతో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఎండవేడి కారణంగా నల్లగొండ ప్రాంతంలో గాలిలో తేమ సాధారణం కన్నా 24 శాతం తక్కువై పొడి వాతావరణం ఏర్పడింది. ఎండ తీవ్రతతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడగాల్పులతో ఇబ్బందులు పడుతున్నారు.

Heat Wave Warning To Telugu States For Next 4 Days

Heat Wave Warning To Telugu States For Next 4 Days

మొన్న (సోమవారం) ఆదిలాబాద్‌ జిల్లా చాప్రాలలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్లలో మార్చి ఉష్ణోగ్రతల్లో ఇదే కొత్త రికార్డ్‌. 2016 మార్చి 18న భద్రాచలంలో 42.8గా నమోదు కాగా.. 2017 మార్చి 31న ఆదిలాబాద్‌లో 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం మార్చిలోనే వేడి 43 డిగ్రీలకు చేరాయి. ఏప్రిల్‌, మే నెలల్లో 44 నుంచి 46 డిగ్రీలకు పెరగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మంగళవారం నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో సాధారణం కన్నా 3 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.

విదర్భ నుంచి కేరళ వరకూ గాలులతో ఉపరితల ద్రోణి 900 మీటర్ల ఎత్తున కొనసాగుతోంది. దీంతో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఎండవేడి కారణంగా నల్గొండ ప్రాంతంలో గాలిలో తేమ సాధారణం కన్నా 24 శాతం తక్కువై పొడి వాతావరణం ఏర్పడింది. ఎండ తీవ్రతతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడ గాల్పులతో ఇబ్బందులు పడుతున్నారు.

Read Also : Telangana : ఎండలే ఎండలు.. చరిత్రలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్