Heatwave : ఓ వైపు కరోనా, మరోవైపు ఎండలు..మూడు రోజులూ..ఆ టైంలో బయటకు వెళ్లొద్దు

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల ధాటికి బయటికి వెళ్లాలంటే ప్రజలు వణికిపోతున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎండలు ఏ విధంగా ఉంటాయోనని భయపడిపోతున్నారు.

Heatwave : ఓ వైపు కరోనా, మరోవైపు ఎండలు..మూడు రోజులూ..ఆ టైంలో బయటకు వెళ్లొద్దు

Telangana corona

Telangana : తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల ధాటికి బయటికి వెళ్లాలంటే ప్రజలు వణికిపోతున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎండలు ఏ విధంగా ఉంటాయోనని భయపడిపోతున్నారు. తాజాగా భారత వాతావరణ విభాగం తెలంగాణ ప్రజానీకంపై బాంబు పేల్చింది. రానున్న మూడు రోజులు ఎండల తీవ్రత అధికంగా ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మూడు రోజుల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌పై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఎండతీవ్రతకు ప్రతి ఒక్కరూ అల్లాడిపోతున్నారు. నడినెత్తిపై సూర్యుడు, ఉక్కపోతతో ఏం ఎండలురా బాబు అనిపిస్తున్నాడు. గ్రేటర్‌లో మార్చి 15 నుంచి 31 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజూ సగటున 37 డిగ్రీలకు పైగా ఎండలు ఉండడంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, చిరువ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత మూడ్రోజులుగా ఎండ తీవ్రత మరింత పెరిగింది. తక్కువ ఎత్తులో ఉత్తర, వాయువ్య దిశల నుంచి వేడిగాలులు తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నందున ఎండతీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఇబ్బందులు పడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతతో పాటు రాత్రి కూడా ఉష్ణోగ్రత పెరుగుతుండడంతో ఉక్కపోతకి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ నుంచి రక్షణ కోసం అమ్మాయిలు చున్నీలు, గొడుగులు, స్కార్ప్‌లు.. పురుషులైతే కళ్లజోళ్లు, టోపీలు పెట్టుకుని జాగ్రత్తలు పడుతున్నారు.
రానున్న మూడ్రోజుల్లో దాదాపు 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ముఖ్యంగా మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట తదితర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా యెల్లో అలర్ట్‌ను జారీ చేశారు అధికారులు. ఎండలు మరింత ఎక్కువైతే రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. చంటిపిల్లలు, వృద్ధులు జాగ్రత్త వహించాలని కోరారు. ఎండల వల్ల ప్రజలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు కోరుతున్నారు.

Read More : Corona fear : తెలంగాణలో కరోనా భయం..భయం, మళ్లీ పాత రోజులే ?