Projects Flood Water : తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ..కృష్ణా, గోదావరి పరుగులు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గేట్లు తెరవడంతో జలదృశ్యం కన్నుల విందు చేస్తోంది. ఓవైపు బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే...మరోవైపు గలగలా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది.

Projects Flood Water : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గేట్లు తెరవడంతో జలదృశ్యం కన్నుల విందు చేస్తోంది. ఓవైపు బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే…మరోవైపు గలగలా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 62 వేల 391 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో ఒక లక్షా 15 వేల 876 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 882.20 అడుగులుగా కొనసాగుతోంది.

ఇక రెండు వందల టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఇక ఏపీ, తెలంగాణ జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 76 వేల 495 క్యూసెక్కులుగా ఉంది. పోలవరం ప్రాజెక్టు దగ్గర ప్రవాహం భిన్నంగా ఉంది. వరద పెరుగుతూ, తగ్గుతూ ఉంది. ప్రస్తుతం 7 లక్షల 43 వేల 587 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

Heavy Rain Forecast : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..తెలంగాణలో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలంగాణలో పలు ప్రాజెక్టులు నిండుకుండాలా మారాయి. జూరాల, స్వర్ణ, శ్రీరామ్‌ సాగర్‌, సింగూర్‌, ఉస్మాన్‌ సాగర్‌, మూసీ, నిజామ్‌సాగర్, లోయర్‌ మానేర్‌ డ్యామ్‌లకు ఇన్‌ఫ్లో భారీగా ఉంది. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఇన్ ఫ్లో 2 లక్షల 30 వేల 680 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి 2 లక్షల 12 వేల 69 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 9 వేల 859 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 680.7 అడగుల నీరు నిలువ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి నీటి విడుదల కొనసాగుతోంది. బ్యారేజ్ ఇన్ ఫ్లో 5 లక్షల 95 వేల 430 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ ఫ్లో 5 లక్షల 95 వేల 430 క్యూసెక్కులుగా ఉంది. నిజామాబాద్ జిల్లా భైంసాలో గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో వెయ్యి క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం 357.60 మీటర్లుగా ఉంది. ఒక గేటు తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు