Heavy Rain In Hyderabad : హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్‌ మరోసారి వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా.. మధ్యాహ్నానికి కుండపోత వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.

Heavy Rain In Hyderabad : హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..లోతట్టు ప్రాంతాలు జలమయం

Heavy Rain In Hyderabad

Heavy Rain In Hyderabad : హైదరాబాద్‌ లో మరోసారి వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా.. మధ్యాహ్నానికి కుండపోత వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సనత్‌నగర్‌లోలో మోకాళ్లలోతు మేర నీరు నిలిచిపోయింది.

దీంతో రవాణా స్తంభించింపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శేరిలింగంపల్లి, చందానగర్, గచ్చిబౌలి, మియపూర్, జూబ్లీహిల్స్, అమీర్ పేట, ఎస్సార్ నగర్ ప్రాంతాలలో కుండపోత వర్షం కురుస్తోంది.

Hyderabad Rains : హైదరాబాద్‌లో వర్షం.. తడిసి ముద్దయిన నగరం

కూకట్ పల్లి, కాప్ర, ఖైరతాబాద్, కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్, ముషీరాబాద్, అంబర్ పేట, ఉప్పల్, చార్మినార్, అల్వాల్ ప్రాంతాల్లోనూ ఓ మోస్తరుగా వానలు పడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ.. హైదరాబాద్‌ వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.