Hyderabad Heavy Rain : హైదరాబాద్‌లో భారీ వర్షం.. చల్లబడ్డ వాతావరణం, సేదతీరిన జనం

Hyderabad Heavy Rain : పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది.

Hyderabad Heavy Rain : హైదరాబాద్‌లో భారీ వర్షం.. చల్లబడ్డ వాతావరణం, సేదతీరిన జనం

Hyderabad Heavy Rain

Rain In Hyderabad : మాడు పగిలే మండుటెండలతో, తీవ్రమైన ఉక్కపోతతో విలవిలలాడిన హైదరాబాద్ నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. దాంతో వాతావరణం చల్లబడింది. నగరవాసులు కొంత రిలీఫ్ పొందారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వాన పడింది. శేరిలింగం పల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడింది.

ఇక, తెలంగాణ రాష్ట్రానికి చల్లని కబురు చెప్పింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, కొమ్రుంభీం, మల్కాజ్ గిరి, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, హన్మకొండ, నిజామాబాద్, నిర్మల్, నారాయణపేట్, భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Also Read..Telangana: తెలంగాణలో 3 రోజులు వర్షాలు పడే అవకాశం

ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మంచిర్యాల, సంగారెడ్డి, వికారాబాద్, సిద్ధిపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వికారాబాద్ జిల్లా పరిగిలో భారీ వాన పడింది. పలు చోట్ల పిడుగులు పడ్డాయి.

Also Read..Life Insurance Corporation : ఒడిశా రైలు దుర్ఘటన బాధితులకు బాసటగా ఎల్ఐసీ