Heavy Rain : హైదరాబాద్‌లో భారీ వర్షం..నాలాలో వ్యక్తి గల్లంతు..రక్షించిన రెస్క్యూ టీమ్

గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు శివార్లలో కురిసిన కుండపోతకు.. జనజీవనం స్తంభించిపోయింది. అప్పటికే ఇళ్లకు చేరుకోవాల్సిన మార్గమధ్యంలో గంటల తరబడి వేచిచూశారు.

Heavy Rain : హైదరాబాద్‌లో భారీ వర్షం..నాలాలో వ్యక్తి గల్లంతు..రక్షించిన రెస్క్యూ టీమ్

Rain

man missing in dirty sewer : గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు శివార్లలో కురిసిన కుండపోతకు.. జనజీవనం స్తంభించిపోయింది. అప్పటికే ఇళ్లకు చేరుకోవాల్సిన మార్గమధ్యంలో గంటల తరబడి వేచిచూశారు. తడచుకుంటూ ట్రాఫిక్‌లోనే బయల్దేరినవారు విసుగెత్తిపోయారు. ట్రాఫిక్‌ రద్దీ అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగింది. నిన్న సాయంత్రం పొడి వాతావరణయే ఉంది. కానీ రాత్రి 7.30, 8 గంటలకు చిన్నగా పడ్డ వర్షం ఆ తర్వాత ఉధృతమైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట్‌లో కార్డు స్థాయిలో 13.68 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

సరూర్‌నగర్‌ మండలం లింగోజిగూడ 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుర్మగూడలో 10 సెంటీమీటర్లు, మహేశ్వరం మండలం పారిశ్రామిక ప్రాంతంలో 9.03, హయత్‌నగర్‌ మండలం సౌత్‌ హస్తినాపురం ప్రాంతంలో 8.83 సెంటీమీటర్లు రెయిన్‌ఫాల్ రికార్డయ్యింది. మలక్‌పేటలో 8.7, సరూర్‌నగర్‌లో 8.6, కంచన్‌బాగ్‌లో 8.4, బహదూర్‌పురాలో 8.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మేడ్చల్‌ జిల్లా ఉప్పల్‌ మండలం మారుతినగర్‌లో 8.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి అల్మాస్‌గూడ చెరువు కట్ట తెగింది. దీంతో సమీపప్రాంతాల్లోని జనావాసాలను వరద నీరు ముంచెత్తింది.

Hyderabad : కుండపోత వర్షం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!

వాన-వరదతో పలువురు ప్రమాదం బారినపడ్డారు. కొంతమంది బైక్‌లపై నుంచి జారిపడ్డారు. సరూర్‌నగర్‌ తపోవన్‌ కాలనీకి చెందిన 37 ఏళ్ల జగదీష్‌.. చింతలకుంట వద్ద నాలాలో పడిపోయాడు. జగదీష్‌ పడిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ టీమ్‌ ఘటనాస్థలికి చేరుకుంది. నాలాలో పడిన వెంటనే తాడు సాయంతో జగదీష్‌ బయటపడ్డాడు.

ఉరుములు, మెరుపులు, హోరుగాలితో కురిసిన వర్షానికి జీహెచ్‌ఎంసీలోని పలు డివిజన్లు జల దిగ్బంధమయ్యాయి. హైదరాబాద్‌లోని ఓల్డ్‌ ఉస్మాన్‌ఘంజ్‌, మహరాజ్‌ఘంజ్‌ మార్కెట్లలో దుకాణాలు నీట మునిగిపోయాయి. గాలులు, వర్షాలకు రాత్రి పలు ప్రాంతాల్లో కరెంట్ పోయింది. ఆ చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ ప్రయాణించారు వాహనదారులు. మోకాలిలోతు నీళ్లు ఉండడంతో ఎక్కడ మ్యాన్‌ హోల్‌ ఉందో తెలిక టెన్షన్ పడ్డారు. చంపాపేట్‌లో ఓ వ్యక్తి మ్యాన్‌హోల్‌లో పడిపోతే స్థానికులు రక్షించారు. బైక్‌పై వస్తున్న ఒకరు.. నాలా దాటుతూ కిందపడిపోతే..స్థానికులు రక్షించారు. భారీ వర్షాలకు ఛత్రినాకలోని నాలాలోకి ఒక ఆటో కొట్టుకుపోయింది.
Siddarth : చిన్న గాయమే సర్జరీ కాదు.. ‘మా ఎలక్షన్స్ లో ఓట్ వేయడానికే లండన్ నుంచి వచ్చాను..

కుండపోత వర్షానికి డ్రెయిన్లు, నాలాల నీరు రోడ్లను ముంచెత్తింది. రోడ్లపై ఉన్న వర్షపు నీరు, మురుగునీరు ఏకమయ్యేసరికి వాహనాలు కొట్టుకుపోయాయి. అలానే ఒక ఆటో..ప్రవాహ ఉధృతిలో పడి కొట్టుకుపోయింది. అత్తాపూర్‌లో జోరున కురిసిన వర్షానికి పలు వాహనాలు నీట మునిగాయి. పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే పిల్లర్‌ నంబర్‌ 188 దగ్గర ఒక కారు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. గంట నుంచి రెండు గంటల పాటు కురిసిన వర్షానికి వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ట్రాఫిక్‌ పోలీసులు గంటల తరబడి ట్రాఫిక్‌ క్లియర్‌ చేయాల్సి వచ్చింది.

ఓ వైపు హోరు వర్షం కురుస్తున్నా..లోతట్టుప్రాంతాల్లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పర్యటించారు. అప్పటికే క్షేత్రస్థాయిలో జీహెచ్‌ఎంసీ అధికారులు, ఉద్యోగులను అలర్ట్ చేసేసరికి వారంతా రోడ్డెక్కి…ముంపు ప్రాంతాలను పరిశీలించారు. నగరవాసులను అత్యవసరమైతేనే తప్ప ఇళ్లు విడిచి రావొద్దని హెచ్చరించారు. రాత్రి పలు కాలనీల్లో పర్యటించిన మేయర్.. రోడ్లపై నీరు సాఫీగా వెళ్లిపోయేలా మాన్సూన్‌ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండేలా చూశారు. అవసరమైతే డీఆర్‌ఎఫ్‌ బృందాలు..సహాయక సేవలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.