Heavy Rain : నగరంలో భారీ వర్షం.. 3 గంటల పాటు బయటకు రావద్దు

: హైదరాబాద్ నగరంలో పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్‌పేట, కాచ్చిగూడ, నల్లకుంట, గోల్నాకలో వాన పడుతున్నది.

Heavy Rain : నగరంలో భారీ వర్షం.. 3 గంటల పాటు బయటకు రావద్దు

Heavy Rain

Heavy Rain : హైదరాబాద్ నగరంలో పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్‌పేట, కాచ్చిగూడ, నల్లకుంట, గోల్నాకలో వాన పడుతున్నది. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, లక్డీకాపూల్‌, ఎల్‌బీనగర్‌, కోఠీ, అబిడ్స్‌, ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, మైత్రివనం, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి, ఆల్విన్‌కాలనీ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ప్రగతినగర్‌, నిజాంపేట, చంపాపేట, రామంతాపూర్‌, బోడుప్పల్‌, పీర్జాదిగూడ, మేడిపల్లి, జీడిమెట్ల, బాలానగర్‌, దుండిగల్‌, కుత్బుల్లాపూర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది.

Read More : Kerala : చీర కట్టుకుని..యువతుల డ్యాన్స్, సూపర్

ఇక ఈ నేపథ్యంలోనే రాత్రి 10 గంటల వరకు ఇళ్లలోంచి బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ తెలిపింది అత్యవసర సమయంలో సాయం కోసం 040-29555500 నంబర్‌లో సంప్రదించాలని కోరింది. ఇక భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదురుకుంటున్నారు. వర్షంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Read More : Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై సందేహాలు, సమస్య వస్తే ఏం చెయ్యాలి.. కంపెనీ ఏం చెబుతోంది?