Hyderabad Rainfall : హైదరాబాద్‌ను మళ్లీ కుమ్మేసిన వాన.. మౌలాలీలో అత్యధిక వర్షపాతం నమోదు

హైదరాబాద్ లో మళ్లీ వరుణుడు విరుచుకుపడ్డాడు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. నగరంలోనే అత్యధికంగా మౌలాలీలో 124 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Hyderabad Rainfall : హైదరాబాద్‌ను మళ్లీ కుమ్మేసిన వాన.. మౌలాలీలో అత్యధిక వర్షపాతం నమోదు

Hyderabad Rains

Hyderabad Rainfall : హైదరాబాద్ లో మళ్లీ వరుణుడు విరుచుకుపడ్డాడు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. నగరంలోనే అత్యధికంగా మౌలాలీలో 124 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేరేడ్ మెట్ లో 73 మిమీ, మల్కాజ్ గిరిలో 51.5 మిమీ వర్షపాతం పడింది. ఫతేనగర్, ఈస్ట్ ఆనంద్ బాగ్, ఆల్వాల్, తిరుమలగిరిలో దాదాపు 50 మిమీ వర్షపాతం నమోదైంది.

Hyderabad Heavy Rain : హైదరాబాద్‌ను వెంటాడుతున్న వరుణుడు.. మళ్లీ భారీ వర్షం

చర్లపల్లిలో 41 మిమీ వర్షం పడగా, వెస్ట్ మారేడ్ పల్లి, ఖైరతాబాద్, ఏఎస్ రావ్ నగర్, బాలానగర్, కుత్బుల్లాపూర్, బేగంపేట, కాప్రాలో 30 నుంచి 40 మిమీ వర్షపాతం నమోదైంది. ఉప్పల్, మారేడ్ పల్లి, అమీర్ పేట్, రాజేంద్రనగర్, హయత్ నగర్, నాంపల్లి, బన్సీలాల్ పేట్, సరూర్ నగర్ లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అమీర్ పేట్ లో కురిసిన భారీ వర్షానికి మైత్రీవనంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

River Musi : హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో భయం భయం.. ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ

వాన నీటిలో పలు వస్తువులు, వాహనాలు కొట్టుకుపోయాయి. యూసుఫ్ గూడలో వర్షం నీటిలో ఫ్రిడ్జి కొట్టుకుపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షంతో రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ స్తంభించడంతో ముందుకు పోలేక, వెనక్కి రాలేక వాహనదారులు నరకయాతన చూశారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఇటీవలి వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటోంది. ఇంతలోనే వరుణుడు మళ్లీ విరుచుకుపడ్డాడు. రెండు రోజులు శాంతించిన వరుణుడు.. మరోసారి హైదరాబాద్ నగరాన్ని దంచికొట్టాడు. శుక్రవారం సాయంత్రం దాదాపు గంట సేపు నగరంలో జడివాన కురిసింది. వర్షానికి ఈదురుగాలులు కూడా తోడయ్యాయి.

భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. న్యూబోయిన్ పల్లిలో చెరువుకట్ట తెగిపోవడంతో వరదనీరు భారీగా వచ్చిపడింది. మలక్ పేట, నాగోల్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాగా, నీరు త్వరగా వెళ్లిపోయేందుకు మ్యాన్ హోల్స్ తెరిచినందున ప్రజలు అప్రమ్తమతంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.