Heavy Rains : రాగల మూడు రోజులు భారీ వర్షాలు

ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కరీంనగర్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తామని పేర్కొంది.

Heavy Rains : రాగల మూడు రోజులు భారీ వర్షాలు

Heavy Rains (1)

Heavy Rains : తెలంగాణలో ద్రోణి ప్రభావం, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వానలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురుస్తుందని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో గంటకు30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Telangana Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం .. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కరీంనగర్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తామని పేర్కొంది.

సోమవారం నుంచి మంగళవారం వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో, ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది.