Telangana: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

వర్షం ముప్పు అప్పుడే ముగియలేదంటున్నారు వాతావరణశాఖ అధికారులు.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Telangana: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Telangana Rains

Telangana: వర్షం ముప్పు అప్పుడే ముగియలేదంటున్నారు వాతావరణశాఖ అధికారులు.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.. నేడు, రేపు భారీ వర్షాలు.. ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చంది. అటు ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, మెదక్‌, మహబుబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. మిగతా జిల్లాలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

భారీ వర్షాల కారణంలో అనేక జిల్లాలు తడిసి ముద్దయ్యాయి.. వరంగల్‌లోని కరీమాబాద్‌, సాకరాశి కుంట, ఏకశిలానగర్‌, శివనగర్‌ ప్రాంతాల్లో ..పెద్ద మోరీ నిండి .. ఇళ్లలోకి నీరు చేరింది. అటు సిద్దిపేట, సిరిసిల్ల, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వర్షం దంచికొట్టింది. దీంతో బస్వాపూర్‌ దగ్గర మోయతుమ్మెత వాగు ఉప్పొంగింది. సిద్దిపేట, హన్మకొండ ప్రధాన వంతెనపై వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. నీటిలో లారీ చిక్కుకుంది.

ఇక రాబోయే 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని.. విశాఖ వాతారణశాఖ తెలిపింది. ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా-దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరగా .. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. స్థిరంగా కొనసాగుతోంది. విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంతపురం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.