Hyderabad : నగర వాసులకు ముఖ్యగమనిక, బయటకు వెళుతున్నారా..ఒక్క నిమిషం ఆగండి

హైదరాబాద్‌ వాసులకు ముఖ్య గమనిక. నగరంలో వర్షం కురుస్తుంటే మీరు బయటకు వెళ్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మేం చెప్పే ఈ ఒక్కమాటను చెవిన పెట్టండి.

Hyderabad : నగర వాసులకు ముఖ్యగమనిక, బయటకు వెళుతున్నారా..ఒక్క నిమిషం ఆగండి

Manhole

Heavy Rains : హైదరాబాద్‌ వాసులకు ముఖ్య గమనిక. నగరంలో వర్షం కురుస్తుంటే మీరు బయటకు వెళ్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మేం చెప్పే ఈ ఒక్కమాటను చెవిన పెట్టండి. ఒకవేళ తెగించి బయటకు వెళ్లారో.. ఇక మీ ఇష్టం. మీరు మళ్లీ ఇంటికి వస్తారో.. రారో.. నో గ్యారెంటీ. ఇందుకు హైదరాబాద్‌ రోడ్లే ప్రధాన కారణం. భాగ్యనగర రోడ్లు చిన్న వానకే చిత్తడవుతున్నాయి. అరగంట, గంటపాటు ఏకధాటిగా వర్షం కురిస్తే చాలు కాలనీలు నీటమునిగిపోతున్నాయి. నాలాలు పొంగి పొర్లుతున్నాయి.

Read More : Telugu States : మూడు రోజులు భారీ వర్షాలు, ఇంట్లోనే ఉండండి..బయటకు రావొద్దు

రోడ్లపైకి వరదనీరు చేరి జలాశయాలను తలపిస్తున్నాయి. ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో.. ఏ మ్యాన్‌ హోల్‌ నోరు తెరిచి ఉందో తెలియని పరిస్థితి. వర్షం వచ్చిన ప్రతీసారి లోతట్టు ప్రాంతవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఒక్కోసారి నాలుగైదు రోజులపాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు నీళ్లల్లోనే ఉంటున్నారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు సైతం నగరం వరదల్లో మునిగిపోయింది. అయినప్పటికీ పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

Read More : Cyclone : వణికిన ఉత్తరాంధ్ర, శ్రీకాకుళంపై గులాబ్ ప్రభావం

నగరంలో ప్రతీ ఏటా మ్యాన్‌హోల్‌లో పడి అమాయకులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా మణికొండలో డ్రైనేజీ గుంతలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మణికొండ గోల్డెన్‌ టెంపుల్‌ ముందు నడుచుకుంటూ వెళ్తున్న అతను.. నీటిలో గుంత కనిపించక అందులో పడిపోయాడు. నాలా వర్క్‌ చేసిన సిబ్బంది.. చిన్న సైన్‌ బోర్డులు తప్ప ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదు. భారీ వర్షానికి ఆ సైన్‌ బోర్డులు కొట్టుకుపోయాయి. ఆ గుంతను గమనించకుండా వచ్చిన ఆ వ్యక్తి నాలాలో పడి గల్లంతయ్యాడు. అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమంటున్నారు స్థానికులు. మణికొండలో డ్రైనేజీలో గల్లంతైన రజనీకాంత్ కుటుంబసభ్యులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి… నిర్మాణాల వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.