AP Telangana Heavy Rains : బంగాళాఖాతంలో వాయుగుండం..ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో మరో రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అటు వాయుగుండం ఎఫెక్ట్ ఏపీలోనూ తీవ్రంగా ఉంది. వాయుగుండం జార్ఖండ్‌ వైపు మళ్లడంతో దాని ప్రభావం ఉత్తరాంధ్రపై తగ్గిందని అమరావతి వాతావరణకేంద్రం తెలిపింది. ఇక రానున్న రెండు రోజులపాటు ఉత్తరకోస్తా, దక్షిణకోస్తా, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.

AP Telangana Heavy Rains : బంగాళాఖాతంలో వాయుగుండం..ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

AP Telangana heavy rains

AP Telangana Heavy Rains : బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో మరో రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో.. ఉరుములు, మెరుపులతో .. అతి భారీ వర్షాలు కురుస్తాయని.. హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది.

గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. ఇక జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్‌, మెదక్‌, వరంగల్‌, హన్మకొండ, భూపాల్‌పల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, ఖమ్మం, మేడ్చల్‌, రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

Mud Bath: అధికారులు బురదలో స్నానం చేస్తే వర్షాలు కురుస్తాయట.. పురాతన సంప్రదాయం

అటు వాయుగుండం ఎఫెక్ట్ ఏపీలోనూ తీవ్రంగా ఉంది. వాయుగుండం జార్ఖండ్‌ వైపు మళ్లడంతో దాని ప్రభావం ఉత్తరాంధ్రపై తగ్గిందని అమరావతి వాతావరణకేంద్రం తెలిపింది. ఇక రానున్న రెండు రోజులపాటు ఉత్తరకోస్తా, దక్షిణకోస్తా, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇప్పటికే తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

ఇక మన్యం జిల్లా భామిని, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సీతంపేట, పాలకొండ మండలాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. అటు విజయనగరం, బబ్బిలి, సాలూరు తదితర మండలాల్లో చెదురుమదురుగా జల్లులు కురిశాయి. ఇక శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.