Heavy Rains In Telangana: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి శ్రీలంక వరకు దాదాపు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వివరించారు. అలాగే, రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మరోవైపు రెండు రోజుల క్రితం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడిన విషయం తెలిసిందే.

Heavy Rains In Telangana: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం

Rains in Hyderabad

Heavy Rains In Telangana: తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి శ్రీలంక వరకు దాదాపు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వివరించారు. అలాగే, రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మరోవైపు రెండు రోజుల క్రితం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడిన విషయం తెలిసిందే.

సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరిలో అత్యధికంగా 12.6 సెంటీమీటర్ల వర్షం పడింది. అలాగే, మరికొన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడింది. తెలంగాణలోని పలు చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఆ ప్రభావం నుంచి ప్రజలు బయటపడ్డారు. మళ్ళీ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Asia Cup 2022: ఇప్పటివరకు ఏ భారత క్రికెటరూ నెలకొల్పని రికార్డు రేపటితో కొహ్లీ సొంతం