Heavy Rains : తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

ఇక రేపు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, మెదక్‌జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం కూడా తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

Heavy Rains : తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

Rains

Heavy rains : తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశముంది. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రధానంగా ఉత్తర, తూర్పు, తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇవాళ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది.

ఇక రేపు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, మెదక్‌జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం కూడా తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

pakistan : పాకిస్థాన్‌ని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. 147 మంది మృతి

మహబూబ్‌నగర్‌ జిల్లా మొహమ్మదాబాద్‌లో అత్యధికంగా 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్‌ ఫస్ట్‌ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో సాధారణంగా 244 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా… 531 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది.