Heavy Rains Alert : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. హైదరాబాద్‌ సహా తెలంగాణ రాష్ట్రమంతా భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం.. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Heavy Rains Alert : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్!

Heavy Rains In Telugu States, Orange Alert For These Districts

Heavy Rains in Telugu States : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. హైదరాబాద్‌ సహా తెలంగాణ రాష్ట్రమంతా భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం.. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా భారీగా వర్షాలు కురవనున్నాయి. నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిరి, నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోకూడా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.