Nalgonda Heavy Rains : నల్గొండ జిల్లాలో వర్ష బీభత్సం.. నదులను తలపిస్తున్న రహదారులు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో చెరువులు, రహదారులు నదులను తలపిస్తున్నాయి. కుండపోత వానలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.

Nalgonda Heavy Rains : నల్గొండ జిల్లాలో వర్ష బీభత్సం.. నదులను తలపిస్తున్న రహదారులు

Nalgonda Heavy Rains

Nalgonda Heavy Rains : ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో చెరువులు, రహదారులు నదులను తలపిస్తున్నాయి. కుండపోత వానలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు మండలంలో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ధర్మారం చెరువు ఉప్పొంగి పారుతోంది. దీంతో ధర్మారం, లక్షీదేవి కాల్వ గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్గొండలో ఓ ఇంటి గోడ కూలిన ఘటనలో తల్లీకూతురు మృతి చెందారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ పానగల్ బైపాస్ దగ్గర నార్కెట్ పల్లి అద్దంకి రహదారిపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో టౌన్ లోకి వచ్చే వాహనాలను దారి మళ్లించారు. గత రాత్రి నుంచి కూడా విస్తారంగా వానలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Heavy Rain : అమర్ నాథ్ లో కుంభవృష్టి..ఐదుగురు మృతి

అద్దంకి నార్కట్ పల్లి రహదారి చాలా కీలకమైన రహదారి. రెండు రాష్ట్రాలను కలిపే రహదారి ఇది. ఈ రహదారిపై పూర్తిగా వాన నీళ్లు నిలిచిపోయాయి. ఈ రహదారి ఓ చెరువును తలపిస్తోంది. భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ వెళ్లే బస్సులు ఈ రహదారి మీదుగానే వెళ్తున్నాయి.

Heavy Rains : హైద‌రాబాద్ లో రాబోయే మూడు రోజులు అతి భారీ వర్షాలు..రెడ్ అల‌ర్ట్‌ జారీ

ప్రస్తుతం వరద నేపథ్యంలో అలర్ట్ అయిన అధికారులు బస్సులను దారి మళ్లించారు. టౌన్ లోకి వచ్చే చిన్న చిన్న వాహనాలను అధికారులు అనుమతించడం లేదు. ఫ్లైఓవర్ బ్రిడ్జికి సంబంధించిన పనులు జరుగుతుండటంతో ఈ ప్రాంతంలో నీరు ఎక్కువగా నిలిచిపోవడానికి కారణమైంది. రహదారిపై భారీగా నీరు నిలిచిపోవడంతో అటు వెళ్లేందుకు వాహనదారులు భయపడే పరిస్థితి నెలకొంది. ఏపీ వైపు నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఈ రహదారిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.

Rains In Telangana : రాగల మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు