Heavy Rains : తెలంగాణలో మరో ఐదురోజులు భారీ వర్షాలు.. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో

వాతావరణంలో నెలకొని ఉన్న అనిశ్చితి, ద్రోణి ప్రభావంతో ఏర్పడిన క్యుములోనింబస్ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Heavy Rains : తెలంగాణలో మరో ఐదురోజులు భారీ వర్షాలు.. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో

Heavy Rains

Heavy Rains : తెలంగాణలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండలు దంచికొడుతుంటే మరోవైపు అకాల వర్షాలు అతాలాకుతలం చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఈదురుగాలుతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

వాతావరణంలో నెలకొని ఉన్న అనిశ్చితి, ద్రోణి ప్రభావంతో ఏర్పడిన క్యుములోనింబస్ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షాలు, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సాధారణంగా వర్షాకాలంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.

Telugu States Rains : తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా అకాల వర్షాలు.. ఈదురుగాలులు, వడగళ్లకు దెబ్బతిన్న పంటలు

కానీ, ఈ ఏడాది వేసవికాలం ప్రారంభం నుంచే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.  అయితే, దక్కన్ పీఠభూమి ప్రాంతం కావడం, అధిక ఉష్ణోగ్రతలు నమోదు కారణంగా ఆవర్తన ద్రోణులు ఏర్పడటం, మరఠ్వాడ ప్రాంతం సమీపంలో ఉండటం వల్ల ఏర్పడిన క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వేసవికాలంలో అధిక వర్షపాతం నమోదవుతోందని హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ నాగరత్న పేర్కొన్నారు.

మార్చి1 నుంచి ఎప్రిల్ 26వ తేదీ వరకు సాధారణ వర్షపాతం కంటే అన్ని జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. కాగా, సోమవారం, మంగళవారం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. అకాల వర్షాలతో పలు జిల్లాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబావ్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో వరి, మొక్కజొన్న పంటలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయి.

Rains In Telangana: శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్ లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో చెరువును తలపించాయి. వాహనదారులు, పాదాచారులు, ప్రజలు తీవ్రంగా పడ్డారు. మరోవైపు వర్షాలకు తడిసి మట్టిగోడలు కూలిపోయాయి.