Telangana Rains : మంత్రులు, ఎమ్మెల్యేలను అలర్ట్ చేసిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రానికి భారీగా వరదనీరు వస్తోంది. దీంతో సీఎం కేసీఆర్..మంత్రులు, ఎమ్మెల్యేలను అలర్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తుతుండడంతో వరద ఉధృతి పెరగనుందని ఈ క్రమంలో...గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలందరూ తమ తమ జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

Telangana Rains : మంత్రులు, ఎమ్మెల్యేలను అలర్ట్ చేసిన సీఎం కేసీఆర్

Kcr rain

Heavy Rains Telangana: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలతో ప్రాజెక్టులన్నీ ఫుల్ అవుతున్నాయి. ప్రాజెక్టుల గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతుండడంతో తెలంగాణ రాష్ట్రానికి భారీగా వరదనీరు వస్తోంది. దీంతో సీఎం కేసీఆర్..మంత్రులు, ఎమ్మెల్యేలను అలర్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తుతుండడంతో వరద ఉధృతి పెరగనుందని ఈ క్రమంలో…గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలందరూ తమ తమ జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

Read More : Coronavirus : వైర‌స్ లీక్‌పై డ‌బ్ల్యూహెచ్‌వో 2వ‌సారి ద‌ర్యాప్తు.. ఖండించిన చైనా

ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని, అన్ని స్థాయిల్లో ఉన్న టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్ కు అందుబాటులో ఉంటూ..సమీక్షించాలని సూచించారు. గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల దాకా, పార్టీ కార్యకర్తలు నేతలు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పలు సూచనలు చేశారు సీఎం కేసీఆర్. ప్రజలు బయటకు రాకుండా ఉండడమే ఉత్తమమని, రానున్న రెండురోజులు అతి భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Read More : Minor Girl Death : అమానుషం.. జీన్స్ ధరిస్తోందని బాలికను హత్య చేసిన కుటుంబసభ్యులు

మరోవైపు… తెలంగాణవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో 3 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. హైదరాబాద్ లో వారం రోజులు వానలు పడుతున్నాయి. గ్రేటర్ పరిధిలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వర్షం నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు వర్షం, మరోవైపు వరద నీరుతో నగరవాసులకు అవస్థలు తప్పడం లేదు. వాన నీరు ఇళ్లలోకి చేరడంతో కట్టుబట్టలతో ఖాళీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.