Helmet Lock : హెల్మెట్ పెట్టుకోవడమే కాదు.. లాక్ కూడా వేసుకోవాలి

పోలీసులు ఫైన్ వేస్తారని కాకుండా.. తమ ప్రాణాలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో హెల్మెట్ ధరించాలి. నాణ్యమైన హెల్మెట్ ధరించి మీ జీవితాలను కాపాడుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Helmet Lock : హెల్మెట్ పెట్టుకోవడమే కాదు.. లాక్ కూడా వేసుకోవాలి

Helmet Lock

Helmet Lock : బైక్ నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. అయితే కొందరు ఈ హెల్మెట్‍‌ను తమ ప్రాణాలకు రక్షణగా కాకుండా పోలీసులు ఫైన్ వేస్తారేమో అనే ఉద్దేశంతో తలకు తగిలించుకుంటుకుంటారు. నాణ్యమైన హెల్మెట్ కొనక.. తక్కువ ధరకు వచ్చే రక్షణ లేని హెల్మెట్స్ పెట్టుకొని ప్రాణాలు విడుస్తున్నారు. మరికొందరు హెల్మెట్ పెట్టుకుంటున్నారు కానీ.. లాక్‌ వేసుకోవడం లేదు. దీంతో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లాక్ వేసుకోకుండా పెట్టుకున్న హెల్మెట్ ఊడిపోతుంది. దీంతో తలకు బలమైన గాయాలై ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

చదవండి : Helmet – Mask: మాస్క్, సెకండ్ హెల్మెట్ లేకున్నా ఫైన్ తప్పదు.. బీ అలర్ట్!!

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వట్టినాగులపల్లి, కోకాపేట ఔటర్ సర్వీస్ రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా ఆకులవారితోట గ్రామానికి చెందిన ఆకాశపు శ్రీనివాస్ (28) బేగంపేట్ లోని వీ కోలాబ్ సాఫ్ట్ వేర్ సంస్థలో విధులు నిర్వహిస్తూ.. సనత్ నగర్ బీ-3 ప్లాట్ లో నివాసముంటున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో విధులు ముగించుకొని తన పల్సర్ వాహనంపై శంకర్ పల్లి, మొఖిల గ్రామానికి చెందిన స్నేహితుడి ఇంటికి బయలుదేరాడు. కోకాపేట ఔటర్ సర్వీస్ రోడ్డు వద్దకు రాగానే వేగంగా వచ్చిన టిప్పర్ శ్రీనివాస్ ప్రయాణిస్తున్న బండిని ఢీకొంది.

చదవండి : Kernel Helmet: మనిషి మెదడును చదివే హెల్మెట్.. ధర రూ.3,700!

ఈ ప్రమాదంలో శ్రీనివాస్ పైకి ఎగిరాడు.. అయితే తాను హెల్మెట్ పెట్టుకున్నాడు కానీ.. లాక్ చేసుకోలేదు.. దీంతో ఆ హెల్మెట్ గాల్లోనే ఊడిపోయింది. శ్రీనివాస్ రోడ్డుపై పడగడంతో తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. హెల్మెట్ లాక్ పెట్టుకొని ఉంటే శ్రీనివాస్ గాయాలతో బయటపడేవారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇలా ఒక్క శ్రీనివాస్ ఏ కాదు అనేకమంది హెల్మెట్ లాక్ వేసుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకున్నవారు, ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. పోలీసులు ఫైన్ వేస్తారని కాకుండా, తమ ప్రాణాలకు రక్షణగా హెల్మెట్‌ను భావించాలి.. నాణ్యమైన హెల్మెట్ ధరించి..లాక్ వేసుకొని ఉహిచని రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడాలి.