High Court : తెలంగాణలో గురుకుల విద్యాలయాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల దృష్ట్యా గురుకులాలు ప్రారంభించాలని, గురుకులాల పున:ప్రారంభంపై స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం కోరింది.

High Court : తెలంగాణలో గురుకుల విద్యాలయాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Gurukul Schools

High Court allows Gurukul schools : తెలంగాణలో గురుకుల విద్యాలయాలు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ దృష్ట్యా గురుకులాలు ప్రారంభించాలని, గురుకులాల పున:ప్రారంభంపై స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరిన సంగతి విధితమే. గురుకులాలు తెరవొద్దని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా నిబంధనలను అనుసరిస్తూ మిగిలిని పాఠశాలలు నడుస్తున్నాయని ప్రభుత్వ లాయర్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితుల దృష్ట్యా పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని ప్రభుత్వ లాయర్ సోమవారం కోర్టును కోరారు.

DH Srinivasa Rao : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 99శాతం సేఫ్ జోన్ లో ఉన్నారు : డీహెచ్ శ్రీనివాసరావు

ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సీజే ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. విద్యా సంస్థల్లో కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

గురుకులాల్లో ప్రత్యక్ష, ఆన్ లైన్ బోధన చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. గురుకులాలను తెరవద్దని జారీ చేసిన గత ఆదేశాలను సవరిస్తూ ఇప్పుడు గురుకులాలను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.