హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు సీరియస్..అధికారుల నియంత్రణ కొరవడిందని వ్యాఖ్య

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు సీరియస్..అధికారుల నియంత్రణ కొరవడిందని వ్యాఖ్య

High court angry over illegal structures : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది.

అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ.. అనేకమంది కోర్టులను ఆశ్రయిస్తున్నారని.. ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలంటూ GHMC జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. 2019లో ఎన్ని అక్రమ నిర్మాణాలు గుర్తించారు.. ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని కోరింది.

అలాగే.. స్టేలు తొలగించాలంటూ కోర్టుల్లో ఎన్ని పిటిషన్లు వేశారో కూడా చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ స్టే వెకేట్ పిటిషన్లు వేయకపోతే కారణాలు తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది.