High Court : హుస్సేన్ సాగర్ లో కాకుండా స్థానికంగా గణేష్ నిమజ్జనం : హైకోర్టు

హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది. గణేష్ సామూహిక నిమజ్జనం కాకుండా ఎక్కడికక్కడే స్థానికంగా నిమజ్జనం జరిగితే బాగుంటుందని హైకోర్టు అభిప్రాయపడింది.

High Court : హుస్సేన్ సాగర్ లో కాకుండా స్థానికంగా గణేష్ నిమజ్జనం : హైకోర్టు

Ganesh Immersion

Ganesh immersion in Hussain Sagar : హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది. హుస్సేన్ సాగర్ లో గణేష్ సామూహిక నిమజ్జనం కాకుండా ఎక్కడికక్కడే స్థానికంగా నిమజ్జనం జరిగితే బాగుంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. నిమజ్జనం సమయంలో విధించే ఆంక్షలు, నియంత్రణ చర్యలు సూచించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రభుత్వం, గణేష్ ఉత్సవ కమిటీ, పిటిషనర్ నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం నిషేధించాలని న్యాయవాది వేణు మాధవ్ వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది.

ప్రజల సెంటిమెంట్ ను గౌరవిస్తూనే కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలని తెలిపింది. సామూహిక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ దెబ్బతినకుండా చూడాలని కోరింది. అందరూ సూచనలను పరిగణనలోకి తీసుకొని ఈనెల 6న తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది.

ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం చేస్తే పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడడంతో కరోనా వ్యాప్తి పెరగడంతో పాటు హుస్సేన్‌సాగర్‌లో రసాయనాలు పెరిగిపోతాయని పిటిషనర్‌ వాపోయాడు. పిటిషనర్ వాదన విన్న హైకోర్టు సమర్ధిస్తూనే.. ప్రభుత్వం ఎక్కడికక్కడ నిమజ్జనం ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని అభిప్రాయం పడింది.