Amnesia Pub Case : అమ్నేసియా పబ్ కేసులో కీలక మలుపు.. వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడిని మైనర్ గా పరిగణిస్తూ హైకోర్టు ఆదేశాలు

అమ్నేసియా పబ్ కేసులో వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు నిందితుడిగా ఉన్నాడు. గతంలో అతనికి పోటెన్సీ టెస్టు చేసి, మేజర్ గా పరిగణించాలని జువైనల్ కోర్టును పోలీసులు కోరారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన జువైనల్ కోర్టు.. నిందితుడిని మేజర్ గా పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Amnesia Pub Case : అమ్నేసియా పబ్ కేసులో కీలక మలుపు.. వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడిని మైనర్ గా పరిగణిస్తూ హైకోర్టు ఆదేశాలు

Amnesia Pub Case

Amnesia Pub Case : హైదరాబాద్ జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆమ్నేసియా పబ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడిని మైనర్ గా పరిగణిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడిని మేజర్ గా పరిగణిస్తూ గతంలో జువైనల్ కోర్టు ఆదేశించింది.

జువైనల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వక్ఫ్ బోర్డు చైర్మన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అతడిని మైనర్ గా పరిగణిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కాగా, అమ్నేసియా పబ్ కేసులో మొత్తం ముగ్గురు నిందితులు ఉన్నారు. వీరిలో ఒకరు మేజర్ కాగా, మిగిలిన ఇద్దరు మైనర్లుగా ఉన్నారు. వీరందరినీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

Fake Currency Gang : అంతర్ రాష్ట్ర ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టు.. 13 మంది అరెస్టు

అమ్నేసియా పబ్ కేసులో వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు నిందితుడిగా ఉన్నాడు. గతంలో అతనికి పోటెన్సీ టెస్టు చేసి, మేజర్ గా పరిగణించాలని జువైనల్ కోర్టును పోలీసులు కోరారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన జువైనల్ కోర్టు.. నిందితుడిని మేజర్ గా పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే జువైనల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితుడి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జువైనల్ కోర్టు తీర్పును తప్పు బడుతూ నిందితుడిని మైనర్ గా పరిగణిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.

2022 మే 28న స్నేహితులతో కలిసి ఫ్రెషర్స్ పార్టీకి వెళ్లిన బాలికపై సామూహిక అత్యాచారం జరిపిన ఘటన  కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా బాలికే మీడియాకు తెలపడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితుల్లో వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు కూడా ఉన్నాడు.

Avinash Reddy Bail : అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

అయితే నిందితులను మేజర్లుగా పరిగణించాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 2022 సెప్టెంబర్ 30న నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, జువైనల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వక్ఫ్ బోర్డు చైర్మన్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడిని మైనర్ గా పరిగణిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.