High Court : జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నాపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

జూనియర్ లెక్షరర్(జేఎల్) నియామక పరీక్ష ప్రశ్నాపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. జేఎల్ పేపర్-2 పరీక్ష ప్రశ్నాపత్రం తెలుగులోనూ ఇవ్వాలని ఆదేశించింది. పేపర్-2 ఇంగ్లీష్ లోనే ఇవ్వాలన్న టీఎస్పీఎస్సీ నిర్ణయంపై హైకోర్టు విచారణ చేపట్టింది.

High Court : జూనియర్ లెక్షరర్(జేఎల్) నియామక పరీక్ష ప్రశ్నాపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. జేఎల్ పేపర్-2 పరీక్ష ప్రశ్నాపత్రం తెలుగులోనూ ఇవ్వాలని ఆదేశించింది. పేపర్-2 ఇంగ్లీష్ లోనే ఇవ్వాలన్న టీఎస్పీఎస్సీ నిర్ణయంపై హైకోర్టు విచారణ చేపట్టింది. పేపర్-2 పరీక్ష ప్రశ్నాపత్రాన్ని ఇంగ్లీష్, తెలుగులో ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. టీఎస్పీఎస్సీ ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించడం సరికాదని తెలిపింది.

టీఎస్పీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ లో జేఎల్ పేపర్-2ను ఇంగ్లీష్ లోనే ఇవ్వాలని నిర్ణయించింది. కానీ దీనిపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగులో పీజీ చదువుతున్న అభ్యర్థులు నష్టపోతున్నామని టీఎస్పీఎస్సీకి విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో అభ్యర్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

TSPSC Paper Leak : TSPSC పేపర్ లీక్ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ ఆరా

ఈ అంశంపై కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జేఎల్ ప్రశ్నాపత్రం పేపర్-1 తెలుగు, ఇంగ్లీష్ లో ఇస్తున్నట్లుగానే.. పేపర్-2 కూడా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఇవ్వాలని ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు