గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

High Court notices to Telangana government : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది. గోరేటి వెంకన్న, దయానంద, సారయ్యలను ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది.

రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలు చేశారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గోరేటి వెంకన్న, సారయ్య, దయానందల నియామకాలను ఛాలెంజ్ చేస్తూ ధన్ గోపాల్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు.

తన పేరును రెండు సార్లు గవర్నర్ ప్రతిపాదించినప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదేని పిటిషన్‌లో వెల్లడించారు. రాష్ట్ర మంత్రివర్గ సిఫార్సులను ఆమోదించడంపై పిటిషనర్ ధన్ గోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా నియామకం చేపట్టారని పిటిషనర్ పేర్కొన్నారు.

దీనిపై సమాధానం ఇవ్వాలని ప్రభుత్వానికి, ముగ్గురు ఎమ్మెల్సీలకూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.