దీపావళి టపాసులుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  • Published By: vamsi ,Published On : November 12, 2020 / 01:46 PM IST
దీపావళి టపాసులుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కరోనా వ్యాప్తి సమయంలో దీపావళి టపాసులు, సంబరాలపై ఇప్పటికే పలు రాష్ట్రాలు నిషేధం విధించగా.. తెలంగాణ రాష్ట్రంలో కూడా టపాసుల విక్రయంపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ హైకోర్టు. దీపావళిపై తెలంగాణ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వేళ టపాకాయలు పేల్చడం అవసరమా? అని ప్రశ్నించింది హైకోర్ట్.



కరోనా వైరస్ కేసులు పెరగడం, కాలుష్యం తీవ్రత అధికం కావడంతో శ్వాసకోశ ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని, ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోవలసిందిగా హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఇప్పటివరకు తెరిచిన షాపులను వెంటనే మూసేయాలని, తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.



ఢిల్లీ ప్రభుత్వం తొలుత టపాసుల విక్రయాలపై నిషేధం విధించగా.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ సైతం టపాసుల విక్రయాలపై నిషేధం విధించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరాదిన 6 రాష్ట్రాలు టపాసుల విక్రయాలపై నిషేధం విధించింది.