దిశ కేసు : మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగించాలని ఆదేశం

సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుల మృతదేహాలకు రీ-పోస్టుమార్టం చేయాలని చెప్పింది.

  • Published By: veegamteam ,Published On : December 21, 2019 / 09:47 AM IST
దిశ కేసు : మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగించాలని ఆదేశం

సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుల మృతదేహాలకు రీ-పోస్టుమార్టం చేయాలని చెప్పింది.

సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుల మృతదేహాలకు రీ-పోస్టుమార్టం చేయాలని చెప్పింది. డిసెంబర్ 23న సాయంత్రం 5గంటల లోపు రీపోస్టుమార్టం పూర్తి చేయాలంది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై హైకోర్టులో శనివారం(డిసెంబర్ 21,2019) విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీకి కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

కాగా, రీ పోస్టుమార్టంకు సంబంధించి హైకోర్టు ఓ మార్పు చేసింది. రీ పోస్టు‌మార్టంను తెలంగాణ రాష్ట్రేతరులతోనే నిర్వహించాలంది. ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన ముగ్గురు ఫోరెన్సిక్ నిపుణులతో రీ-పోస్టుమార్టం చేయించాలని చెప్పింది. ఈ మేరకు తెలంగాణ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎయిమ్స్ కు లేఖ రాయాలంది. ఎయిమ్స్ డాక్టర్లకు అయ్యే ఖర్చులను తెలంగాణ ప్రభుత్వమే భరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. పోస్టుమార్టం మొత్తాన్ని వీడియో తీయాలంది.

రీ-పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించాలని హైకోర్టు చెప్పింది. కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ను సీల్డ్ కవర్ లో భద్రపరచాలని కోర్టు తెలిపింది. ఎన్ కౌంటర్ కు సంబంధించిన అన్ని ఆధారాలను భద్రపరచాలంది. పోలీసులు వాడిన బుల్లెట్లు, వెపన్లు, వాహనాలు, నమోదైన కేసుల వివరాలు, ఎఫ్ఐఆర్ కాపీలను సిట్ ఆధీనంలో భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది.

దిశ హత్యాచారం కేసు విచారణలో ఉండగానే డిసెంబర్ 6న చటాన్ పల్లి దగ్గర ఎన్ కౌంటర్ లో నలుగురు నిందితులు చనిపోయారు. ఘటన జరిగి 16 రోజులు అవుతున్నా.. నిందితుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించలేదు, అంత్యక్రియలు జరగలేదు. ఎన్‌కౌంటర్ పై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణ జరుగుతుండటంతో మృతదేహాల్ని భద్రపరిచాలని ఆదేశాలు ఉన్నాయి. దీంతో గాంధీ ఆసుపత్రిలో శవాలను భద్రపరిచారు. కాగా, ఇప్పటికే శవాలు 50శాతం కుళ్లిపోయాయని గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్ శ్రావణ్ కోర్టుకి తెలిపారు. ఇలాగే కొనసాగితే మరో వారంలో పూర్తిగా కుళ్లిపోతాయని వెల్లడించారు. దీంతో వెంటనే రీపోస్టుమార్టం నిర్వహించి డెడ్ బాడీలను కుటుంబసభ్యులకు అప్పగించాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది.