Corona Vaccine : కరోనా వ్యాక్సిన్ 24 గంటలూ అందుబాటులో ఉండాలి : హైకోర్టు

కేసులు పెరుగుతన్నందున కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కోవిడ్ నిబంధలను ఉల్లంఘిస్తోన్న వైన్ షాపులు, రెస్టారెంట్లు, పబ్‌ల లైసెన్స్‌ రద్దు చేయాలని హైకోర్టు చెప్పింది.

Corona Vaccine : కరోనా వ్యాక్సిన్ 24 గంటలూ అందుబాటులో ఉండాలి : హైకోర్టు

Corona Vaccine

High Court orders on corona vaccine : తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ -19 నియంత్రణ చర్యలు చేపట్టింది. కేసులు పెరుగుతన్నందున కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కోవిడ్ నిబంధలను ఉల్లంఘిస్తోన్న వైన్ షాపులు, రెస్టారెంట్లు, పబ్‌ల లైసెన్స్‌ రద్దు చేయాలని హైకోర్టు చెప్పింది. రూల్స్ పాటించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. కరోనా వ్యాక్సిన్ 24 గంటలూ అందుబాటులో ఉండాలని సూచించింది.

కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ పై ప్రభుత్వం పూర్తి నివేదిక సమర్పించింది. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వారికి వ్యాక్సినేషన్‌ వేగంగా చేయాలని చెప్పింది. 22 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలెండర్లు అందుబాటులో ఉంచామని కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. అయితే కోవిడ్ ఆస్పత్రులు 54 ఉన్నాయని చెప్పి , 22 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలెండర్లు పెట్టడం ఏంటని ప్రశ్నించింది హైకోర్టు. 54 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేయాలని సూచించింది.

డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 17 ప్రకారం అడ్వజర్లు కమిటీలో….ప్రైవేట్ వ్యక్తుల సలహాలు తీసుకోవాలని చెప్పింది. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, శుభకార్యాల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఈ నెల 17 లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ఎక్కడైతే ఎక్కువ కేసులు ఉన్నాయో… వాటిని మైక్రో కంటైన్మెంట్ జోన్స్‌ కింద ఎందుకు ప్రకటించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల నుంచి ఆర్టీపీసీఆర్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాలంది. తెలంగాణలో ప్రవేశించే ప్రతి ప్రయాణికుడిని ఆర్టీపీసీఆర్ సర్టిఫికేట్ ఇవ్వాలని తప్పనిసరిగా అడగాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ 19 తేదికి వాయిదా వేసింది.