‘రోజుకు 50 వేల కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదు’.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

10TV Telugu News

High court serious over Telangana government : కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాకు సంబంధించి వివిధ పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. రోజుకు 50 వేల పరీక్షలు చేయాలన్న ఆదేశాలను ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే అమలు చేయడం లేదంటూ సీరియస్ అయింది. అవసరమున్నప్పుడు రోజుకు 50 వేల పరీక్షలు చేస్తామంటూ ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు ఫైర్ అయింది.తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావుకు కోర్టు ధిక్కార నోటీసులు ఇచ్చింది. కోర్టు ధిక్కారణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నా..ప్రైవేటు ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.
https://10tv.in/bjp-release-ghmc-elections-manifesto/
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఏమోగానీ ఎన్నికలయ్యాకా కరోనా రెండో దశ ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించింది. రెండో దశను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదని కామెంట్ చేసింది.రోజుకు 50 వేల కరోనా పరీక్షలు చేయాలని ఇటీవల హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అవసరమున్నప్పుడు రోజుకు 50 వేల పరీక్షలు చేస్తామని శ్రీనివాస్ రావు నివేదిక తెలిపింది. కరోనా పరీక్షలపై మరోసారి హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోజుకు 50 వేలు, వారానికో రోజు లక్ష కరోనా టెస్టులు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కరోనా మరణాలపై ఆడిట్ కమిటీ ఏర్పాటును పరిశీలించాలని సూచించింది.ఐసీఎంఆర్ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని చెప్పింది. కరోనా బాధితులకు ధైర్యం కలిగించేలా మానసిక కేంద్రం ఏర్పాటు చేయాలని తెలిపింది. జీవో 64 అమలు అధికారం పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది. డిసెంబర్ 15లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు అదేశించింది. తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా వేసింది.

10TV Telugu News