Telangana High Court : సస్పెన్షన్‌కు గురైన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు సూచన

ఎమ్మెల్యేల అభ్యర్థనను స్పీకర్‌ పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఇక.. సస్పెండెడ్‌ ఎమ్మెల్యేలను రేపు అసెంబ్లీ సెక్రటరీ దగ్గరుండి స్పీకర్‌ దగ్గరకు తీసుకెళ్లాలని హైకోర్టు సూచించింది.

Telangana High Court : సస్పెన్షన్‌కు గురైన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు సూచన

High Court (1)

Telangana BJP MLAs : బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ జరిగింది. సస్పెన్షన్‌కు గురైన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు పలు సూచనలు చేసింది. అసెంబ్లీ ప్రారంభానికి ముందే.. స్పీకర్‌ దగ్గరికి వెళ్లి తమ వాదనలు వినిపించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఎమ్మెల్యేల అభ్యర్థనను స్పీకర్‌ పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఇక.. సస్పెండెడ్‌ ఎమ్మెల్యేలను రేపు అసెంబ్లీ సెక్రటరీ దగ్గరుండి స్పీకర్‌ దగ్గరకు తీసుకెళ్లాలని హైకోర్టు సూచించింది.

సభకు గౌరవ అధ్యక్షుడు స్పీకరేనని హైకోర్టు స్పష్టం చేసింది. బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు రిప్రజెంట్ చేసుకోవాలని హైకోర్టు సూచించింది. రేపు ఉదయం లోపు స్పీకర్ ముందు సస్పెండ్ అయిన ఎమ్మేల్యేలు స్పీకర్ ముందు హజరవ్వాలని హైకోర్టు తెలిపింది. హైకోర్టు అదేశాల ప్రకారం రేపు ఉదయం అసెంబ్లీ ప్రారంభమయ్యే లోపే స్పీకర్ ముందు ఎమ్మెల్యేలు అభ్యర్థన చేసుకోవచ్చని వెల్లడించింవది. సభాదిపతిగా సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.

BJP MLAS : సస్పెన్షన్‌పై హైకోర్టులో పిటిషన్ వేసిన బీజేపీ ఎమ్మెల్యేలు

మనది పార్లమెంటరీ డెమోక్రసీ అని హైకోర్టు పేర్కొంది. సభలో ప్రజా ప్రతినిధులు ఉంటేనే పార్లమెంట్ డెమోక్రసీ బలపడుతుందని పేర్కొంది. బీజేపీ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్టు ఎటువంటి ఆధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం సభ్యుల హక్కులకు భంగం వాటిల్లుతుందని తెలిపింది. గతంలో పలు కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు కలగచేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది.

మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై మార్చి11న తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ పై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. రిలీఫ్ ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు.

Telangana High Court : బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ

సభా కార్యకలాపాలకు ఆటంకం కల్గించారని బీజేపీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ విధించారు. అయితే తమ విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సభ ముగిసే వరకు సస్పెన్షన్ ఎత్తివేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు. దీనిపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.