Statue Of Equality : స్వర్ణమూర్తికి హై సెక్యూర్టీ.. బుల్లెట్ ప్రూఫ్, జెడ్ కేటగిరి భద్రత

120 కిలోల స్వర్ణమూర్తి కావడం.. అంతేగాకుండా అలంకారణకు ఐదారు కిలోల బంగారు ఆభరణాలను కూడా వినియోగించారు. ప్రస్తుతం స్వర్ణమూర్తి విలువ 75 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే...

Statue Of Equality : స్వర్ణమూర్తికి హై సెక్యూర్టీ.. బుల్లెట్ ప్రూఫ్, జెడ్ కేటగిరి భద్రత

Samata

Samatha Murthy : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంది భగవత్‌ రామానుజాచార్యుల సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం. 216 అడుగుల రామానుజాచార్య విగ్రహంతో పాటు.. అత్యంత విలువైన 120 కేజీల స్వర్ణ విగ్రహాన్ని కూడా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తోంది. దాదాపు 75 కోట్ల విలువైన ఈ స్వర్ణమూర్తికి బుల్లెట్‌ ప్రూఫ్‌ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. జెడ్ కేటగిరి స్థాయిలో భద్రతా చర్యలు చేపడుతున్నారు జీయర్‌ స్వామి ట్రస్ట్ నిర్వాహకులు. 12 రోజుల పాటు ముచ్చింతల్‌లో జరిగిన రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మున్ముందు కూడా ఇదే స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు చేపడుతున్నారు. విగ్రహానికి 6 నుంచి 8 అడుగుల దూరం నుంచి బుల్లెట్‌ప్రూఫ్‌ గ్లాస్‌ ఫ్రేమ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏర్పాటు చేసేవరకు స్వర్ణమూర్తి సందర్శనకు ఎవరిని అనుమతించరు. ఈ ప్రాంతంలో 24 గంటల పాటు ఆయుధాలు ధరించిన వారు పహారా కాస్తుంటారు.

Read More : సమతా మూర్తి విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతున్న భక్తులు

120 కిలోల స్వర్ణమూర్తి కావడం.. అంతేగాకుండా అలంకారణకు ఐదారు కిలోల బంగారు ఆభరణాలను కూడా వినియోగించారు. ప్రస్తుతం స్వర్ణమూర్తి విలువ 75 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ నిత్య కైంకర్యాలు నిర్వహించే పూజారులు మినహా మరెవరిని విగ్రహం దగ్గరకు అనుమతించారు. ఇక సమతాస్ఫూర్తి ప్రాంగణంలో 250 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఫీడ్‌ను పరిశీలించేందుకు ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. 50 ఎకరాల్లో విస్తరించిన ఈ క్షేత్రాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు రెండు షిఫ్టుల్లో 300 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. లోపలకు ఎంతమంది వచ్చారు, తిరిగి బయటకు ఎందరు వెళ్లారన్న వివరాలు తెలిసే ఏర్పాటు చేస్తున్నారు. స్ఫూర్తి కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్లు, ఇతర బ్యాగేజీని అనుమతించకూడదని భావిస్తున్నారు. టికెట్‌ కౌంటర్‌ పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో సెల్‌ఫోన్లు, లగేజీ, పాదరక్షలు అప్పగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫుడ్‌కోర్టు దగ్గర ఎగ్జిట్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఎంట్రీ వద్ద అప్పగించిన వస్తువులు కన్వేయర్‌ బెల్టు ద్వారా ఎగ్జిట్‌ వరకు చేరతాయి. అక్కడ వాటిని తీసుకుని బయటకు రావాల్సి ఉంటుంది.

Read More : Sri Ramanujacharyulu : సమతామూర్తి దర్శనానికి భక్తులకు అనుమతి

సమతాస్ఫూర్తి కేంద్రంలోకి వచ్చే ప్రతి వెహికల్‌ను స్కానర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అనుమానిత వాహనాలను ఆపేందుకు బూమ్‌ బారియర్స్, బొల్లార్డ్స్‌ను ఏర్పాటు చేశారు. ఒక వేళ వాటిని చేధించుకొని వెళ్లే వాహనాల టైర్లను చీల్చే టైర్‌ కిల్లర్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమతాస్ఫూర్తి కేంద్రంలోని ఆలయాల్లో నిత్య కైంకర్యాలను నిర్వహించేందుకు 250 మంది అర్చకులను నియమించనున్నారు. 108 దివ్యదేశాల్లో ఇద్దరు చొప్పున, మిగతా ఆలయాల్లో మరికొందరని నియమిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇక ఇతర అవసరాలకు కలిపి మొత్తం 800 మంది సిబ్బంది ఉంటారని అంచనా. ఎన్నో విశిష్టతలు ఉన్న సమతాస్ఫూర్తి కేంద్రానికి భక్తులను ఎల్లవేళలా అనుమతించేందుకు శరవేగంగా ఏర్పాటు జరుగుతున్నాయి.. ఈ పనులు పూర్తయ్యేవరకు దర్శనాలను కేవలం సాయంత్రం వేళకే పరిమితం చేయాలని నిర్ణయించారు. రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి ఆరున్నర వరకు అనుమతించనున్నారు. మరో నెల రోజుల్లో పనులు పూర్తవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. సాంకేతిక కారణాల వల్ల 3డీ లేజర్‌షోను తాత్కాలికంగా ఆపేశారు. ఈ భవ్య మందిరాన్ని దర్శించడానికి పెద్దలకు 150 రూపాయలు.. చిన్నారులకు 75 రూపాయలు ఎంట్రీ ఫీజుగా చెల్లించాలని నిర్ణయించారు. మొదట పెద్దలకు 500, చిన్నారులకు 200 రూపాయల టికెట్ ధర పెట్టాలని భావించారు. కానీ అది భక్తులకు భారమవుతుందన్న ఆలోచనతో దాన్ని 150కి తగ్గించారు.