Kamareddy Collectorate High Tension : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద హైటెన్షన్.. గేటు తాళం పగలగొట్టి కార్యాలయంలోకి దూసుకెళ్లిన రైతులు

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. మాస్టర్ ప్లాన్ ను ఉపసంహరించుకోవాలని ఆందోళన చేస్తున్న రైతులు కలెక్టరేట్ గేట్ తాళం పగలగొట్టి లోపలికి దూసుకెళ్లారు.

Kamareddy Collectorate High Tension :  కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. మాస్టర్ ప్లాన్ తో భూములు కోల్పోతున్నామంటూ రైతులు ఆందోళన చేపట్టారు. మాస్టర్ ప్లాన్ ను ఉపసంహరించుకోవాలని ఆందోళన చేస్తున్న రైతులు కలెక్టరేట్ గేట్ తాళం పగలగొట్టి లోపలికి దూసుకెళ్లారు. అధికారులు వేసిన తాళం పగలగొట్టి రైతులు కలెక్టరేట్ లోనికి వెళ్లారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

అయితే పోలీసులు ఎంతగా ఆపేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గని రైతులు గేట్ తాళం పగలగొట్టి కలెక్టరేట్ లోకి వెళ్తున్నారు. రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. లోపలికి వెళ్తున్న కొంత మంది రైతులను పోలీసులు అడ్డుకుని వారిపై పడి గుద్దులు కురిపించినట్లు రైతులు చెబుతున్నారు. అలాగే రైతులు లోపలికి వెళ్లకుండా పోలీసులు ఇనుప కంచెలను కూూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Suryapeta : ధాన్యం ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు.. సూర్యాపేట జిల్లాలో రైతుల ఆందోళన

ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. తోపులాటలో పలువురు రైతులకు గాయలు అయ్యాయి. స్వామి అనే రైతు స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఘటనాస్థలికి అంబులెన్స్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు కలెక్టరేట్ లో ఏం జరుగుతుందోనని ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు