అగ్రికల్చర్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. అన్నదాతల ఆగ్రహం

  • Published By: sreehari ,Published On : November 13, 2020 / 02:49 PM IST
అగ్రికల్చర్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. అన్నదాతల ఆగ్రహం

Palakeedu Agriculture office : సూర్యాపేట జిల్లా పాలకీడు అగ్రికల్చర్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత నెలకొంది. వరిధాన్యం టోకెన్ల కోసం పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి అగ్రికల్చర్ ఆఫీసు వద్ద రైతులు బారులు తీరారు. ఉదయం 11 గంటలకు ఆఫీసుకు వచ్చిన అధికారులతో రైతుల వాగ్వాదానికి దిగారు.



మండలానికి 80 టోకెన్లు మాత్రమే అధికారులు ఇస్తానన్నారు. దాంతో రైతులు, అధికారుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు రైతులను చెదరగొట్టారు. వరిధాన్యం టోకెన్ల కోసం రైతులందరూ లైన్‌లో రావాలంటూ బయటకు వెళ్లగొట్టారు.



హుజూర్ నగర్ ఆర్టీవో వెంకారెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు నేరేడుచర్ల మార్కెట్ యార్డు వద్ద టోకెన్ల కోసం రైతులు ఎగబడ్డారు. టోకెన్ తీసుకోవడానికి కిటికీలో చేతులు పెట్టిన మహిళా రైతు వేలు తెగిపడింది. సిబ్బంది ఒకేసారి కిటికీ తలుపులు వేయడంతో చేతివేలు కట్ అయింది.



వెంటనే మహిళను తోటి రైతులు ఆస్పత్రికి తరలించారు. తిప్పర్తి మార్కెట్ యార్డ్ వద్ద రైతుల ఆందోళన దిగారు. వరిధాన్యానికి రైతులు నిప్పు పెట్టడంతో ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.