Telangana Borders : తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ హై టెన్షన్.. ఏపీ బస్సులు నిలిపివేత

తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. గద్వాల్ జిల్లా ఆలంపూర్ టోల్ గేట్ దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అడ్డుకున్నారు.

Telangana Borders : తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ హై టెన్షన్.. ఏపీ బస్సులు నిలిపివేత

Telangana Borders

Telangana Borders : తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. గద్వాల్ జిల్లా ఆలంపూర్ టోల్ గేట్ దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అడ్డుకున్నారు. ఈ సాస్ ఉంటేనే అనుమతిస్తామన్నా చెప్పారు. పర్మిషన్ లేని వారిని నిలిపేశారు. దీంతో ట్రావెల్స్ బస్సులు వెనక్కి వెళ్లిపోతుండటంతో ప్రయాణికులు టోల్ గేట్ల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. పోలీసులు అనుమతించాలని వేడుకుంటున్నారు.

కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేసిన సంగతి తెలిసిందే. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే సడలింపు ఇచ్చింది. ఈ తర్వాత లాక్ డౌన్ అమల్లోకి వస్తుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ పోలీసులు లాక్ డౌన్ ఆంక్ష‌లను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 తర్వాత అనవసరంగా రోడ్డెక్కిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. కేసులు పెడుతున్నారు, వాహనాలు సీజ్ చేస్తున్నారు. ఈ-పాస్ తప్పనిసరి చేశారు.

తెలంగాణ సరిహద్దుల్లోనూ పోలీసులు లాక్ డౌన్ ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు. ఈ-పాస్ ఉంటేనే వాహ‌నాల‌కు అనుమ‌తి ఇస్తున్నారు. అయితే, ఈ విషయం తెలియని ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ లో వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాస్ లేదని పోలీసులు ప్రైవేట్ ట్రావెల్స్ ను బోర్డర్ లోనే ఆపేస్తున్నారు. దీంతో వారు ప్రయాణికులను అక్కడే దింపి వెళ్లిపోతున్నారు. ముందుకు పోలేక, వెనక్కి రాలేక ప్రయాణికులు నరకం చూస్తున్నారు. కాగా, అత్య‌వ‌స‌ర‌, స‌రుకు, అంబులెన్స్ కు మాత్ర‌మే పాస్‌లు లేకున్నా అనుమ‌తిస్తున్నారు తెలంగాణ పోలీసులు.