Weather Update: తగ్గేదేలే అంటున్న సూర్యుడు.. మరో రెండు రోజులు వడగాలులు

తెలుగు రాష్ట్రాలలో సూర్యుడు తగ్గేదేలే అంటూ మండిపోతున్నాడు. భానుడి భగభగలకు ప్రజలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి

Weather Update: తగ్గేదేలే అంటున్న సూర్యుడు.. మరో రెండు రోజులు వడగాలులు

Summer 11zon

Weather Update: తెలుగు రాష్ట్రాలలో సూర్యుడు తగ్గేదేలే అంటూ మండిపోతున్నాడు. భానుడి భగభగలకు ప్రజలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. వేసవి ఆరంభంలోనే భగభగమంటూ చెమటలు కక్కిస్తున్న భానుడి ప్రతాపానికి.. ప్రజలు ఉదయం నుంచే ఎండ, ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. ఎండకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Summer Sapota Fruit : వేసవిలో ఈపండు తింటే శరీరం చల్లబడుతుంది!

హైదరాబాద్ లో కూడా బుధవారం సాధారణం కంటే 3.5 డిగ్రీలు అధికంగా 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ లో 42.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా నల్గొండ, నిజామాబాద్, రామగుండంలో 41 డిగ్రీలు, మహబూబ్ నగర్, మెదక్ లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక శుక్ర, శని వారాలలో తెలుగు రాష్ట్రాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Summer : వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే కీరదోస!.

ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తుండగా.. శుక్రవారం నుండి తెలంగాణలో కూడా వేడిగాలులు వీయనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. విదర్భ నుంచి కేరళ వరకూ గాలులతో ఉపరితల ద్రోణి 900 మీటర్ల ఎత్తున కొనసాగుతున్న కారణంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. ఎండవేడి కారణంగా గాలిలో తేమ సాధారణం కన్నా 24 శాతం తక్కువై పొడి వాతావరణం ఏర్పడడం.. ఎండ తీవ్రతతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పుడు వడగాల్పులు కూడా తోడవనుండడంతో ప్రజలకు మరింత ఇబ్బంది తప్పేలా కనిపించడం లేదు.