Hitech Fraud : మాయాజూదంలో శకునినే మించిపోయాడు.. పేకముక్కల్లో చైనా సెన్సార్లతో ఘరానా మోసం

పాచికలతో.. శకుని మాయాజూదం ఆడితే.. హైటెక్ హంగులతో పేకాటలో మాయ చేశాడీ అభినవశకుని. టెక్నాలజీ సాయంతో మూడు ముక్కలాటను మాయాజూదంగా మార్చేశాడు. లక్షలు గడించాడు.(Hitech Fraud)

Hitech Fraud : మాయాజూదంలో శకునినే మించిపోయాడు.. పేకముక్కల్లో చైనా సెన్సార్లతో ఘరానా మోసం

Hitech Fraud : పాచికలు మార్చి శకుని ఆడించిన మాయాజూదంతో మహాభారత యుద్ధం జరిగింది. పాచికలతో.. శకుని మాయాజూదం ఆడితే.. హైటెక్ హంగులతో పేకాటలో మాయ చేశాడీ అభినవశకుని. టెక్నాలజీ సాయంతో మూడు ముక్కలాటను మాయాజూదంగా మార్చేశాడు. లక్షలు గడించాడు.

నిజానికి పేకాటలో అదృష్టం ఉంటే డబ్బులు వస్తాయి. దురదృష్టం వెంటాడితే చిల్లి గవ్వ కూడా మిగలదు. మూడుముక్కలాటలో కొందరు భారీగా డబ్బులు పోగేసుకుంటే, సర్వం పోగొట్టుకుని రోడ్డున పడవారు ఎందరో. ఎలాంటి మోసం, వంచన లేకుండా సాగే మామూలు ఆటలో ఇలాంటి సహజంగా జరుగుతుంటాయి.(Hitech Fraud)

Also Read..Fake Currency Gang : ఏం తెలివి.. యూట్యూబ్‌లో చూసి దొంగ నోట్ల తయారీ.. హైటెక్ ముఠా అరెస్ట్

కానీ, ఇలా అదృష్ట, దురదృష్టాలను నమ్ముకోకుండా అచ్చంగా పేకాటలో గెలవడమే పనిగా పెట్టుకోవాలన్నది హైదరాబాద్ కు చెందిన 35ఏళ్ల అన్వేష్ కుమార్ ఆలోచన. అంటే మాయాజూదం లాంటిది అన్నమాట. పాచికలు మార్చి శకుని కౌరవులను గెలిపిస్తే.. శకునిని మించిన మాయాజాలంతో లక్షలు గడించేందుకు ప్లాన్ వేశాడు అన్వేష్ కుమార్. అందుకు తగ్గట్టుగా అన్నీ సమకూర్చుకున్నాడు. అనుకున్నట్లుగానే గేమింగ్ నిర్వహించాడు. ఎన్నిసార్లు ఆడినా, ఎలా ఆడినా గెలుపు అతడిదే. కట్టలకట్టల డబ్బులు వచ్చి పడ్డాయి. అలా లక్షలకు లక్షలకు సంపాదించాడు.

అతడితో ఆడిన వాళ్లంతా జేబులుకు చిల్లు పెట్టుకున్నారు. ఇలా అన్నిసార్లు అతడు గెలవడానికి ఉపయోగపడింది అదృష్టం కానే కాదు. ఓ చైనా పరికరం. సరదాగా ఆడుకునే పేకాట కోసమూ.. ఓ మోసపూరిత పరికరాన్ని తయారు చేసి ప్రపంచ మార్కెట్ లోకి వదిలింది మాయదారి చైనా.

పేకముక్కలు, మొబైల్ స్కానర్లతో పేకాట పేరుతో లక్షలు కొల్లగొట్టాడు అన్వేశ్ కుమార్. చైనా తయారీ పేకముక్కల్లో మాగ్నటిక్ సెన్సార్లు ఉంటాయి. వాటిని స్కాన్ చేసే పరికరం కూడా ఉంటుంది. స్కాన్ చేసిన కార్డు వివరాలు మొబైల్ లో ఎప్పటికప్పుడు వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఒకవేళ మొబైల్ పని చేయకపోతే డబ్బు నోట్ల కట్టలలోపల మరో స్కానింగ్ పరికరం ఉంచాడు. దీనితో ఏ ముక్క ఎటువస్తుందో అన్వేష్ కు ఇట్టే తెలిసిపోతుంది.(Hitech Fraud)

Also Read..UPI Fraud: కొత్త నెంబర్ నుంచి యూపీఐ ద్వారా మనీ వచ్చిందా? అయితే జాగ్రత్త.. ఎందుకంటే

హైదరాబాద్ బాచుపల్లిలో ఈ హైటెక్ ఫ్రాడ్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. మయురా ఫార్చున్ గ్రీన్ హౌసెస్ అపార్ట్ మెంట్ లో హైటెక్ గేమింగ్ నిర్వహిస్తూ పేకాట ఆడేందుకు వచ్చిన వారందరి జేబులు గుల్ల చేశాడు. దీనిపై బాలానగర్ పోలీసులకు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడులు చేశారు. నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడు చేసే మోసాన్ని తెలుసుకుని షాక్ తిన్నారు. నిందితుడి నుంచి చైనా మేడ్ మొబైల్, మూడు మైక్రోఫోన్లు, ఏడు మొబైల్స్, స్కానర్లు, క్యాష్ కౌంటింగ్ మెషీన్, 12 స్పెషల్ స్కానర్ల ప్లే కార్డ్స్, 200 గేమింగ్ కాయిన్స్, రూ.29లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

హైటెక్ గేమింగ్ తో మోసానికి పాల్పడుతున్న అన్వేశ్ తో పాటు దాడి సమయంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడు అన్వేశ్ కుమార్ స్వస్థలం ఒంగోలు అని, 15ఏళ్ల నుంచి బాచుపల్లిలోనే నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు.