Illegal Constructions : అక్రమ కట్టడాలపై హెచ్‌ఎండీఏ ఉక్కుపాదం.. 82 అక్రమ నిర్మాణాలు కూల్చివేత

మేడ్చల్ జోన్, ఘట్ కేసర్, శంకర్‌పల్లి, శంషాబాద్‌ జోన్ల పరిధిలో అనుమతులు లేకుండా నిర్మించిన వాటిని నేలమట్టం చేశారు అధికారులు. మేడ్చల్ జోన్ పరిధిలో ఈ నెల 17న 3 కట్టడాలు కూల్చివేశారు.

Illegal Constructions : అక్రమ కట్టడాలపై హెచ్‌ఎండీఏ ఉక్కుపాదం.. 82 అక్రమ నిర్మాణాలు కూల్చివేత

Demolish

demolishing illegal Constructions : అక్రమ కట్టడాలపై హెచ్‌ఎండీఏ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆరు రోజుల్లో అనుమతి లేని భవనాలు, నిర్మాణాలను కూల్చివేశారు. పెద్దఅంబర్‌ పేట్, శంషాబాద్, మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ భవనాలపై కొరడా ఝులిపించారు. అనుమతులు లేని నిర్మాణంలో ఉన్న మొత్తం 66 భవనాలు కూల్చివేశారు.

మేడ్చల్ జోన్, ఘట్ కేసర్, శంకర్‌పల్లి, శంషాబాద్‌ జోన్ల పరిధిలో అనుమతులు లేకుండా నిర్మించిన వాటిని నేలమట్టం చేశారు అధికారులు. మేడ్చల్ జోన్ పరిధిలో ఈ నెల 17న 3 కట్టడాలు కూల్చివేశారు. ఆ తర్వాత వరుసగా ఐదు రోజుల్లో 23 భవనాలు కూల్చివేయగా..ఒక భవనం సీజ్ చేశారు.

India Corona : భారత్ లో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 3,33,533 పాజిటివ్ కేసులు, 525 మంది మృతి

ఇక ఘట్‌కేసర్ పరిధిలో ఈ నెల 17 నుంచి నిన్నటి వరకు 14 నిర్మాణాలు నేలమట్టం చేశారు అధికారులు. ఇక శంకర్‌పల్లి జోన్‌లో 16 నిర్మాణాలు నేలమట్టమవగా…12 నిర్మాణాలు సీజ్ చేశారు. శంషాబాద్ జోన్‌లో మొత్తం 13 నిర్మాణాలు కూల్చివేశారు. ఇక రెండు భవనాలను సీజ్ చేశారు అధికారులు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో అక్రమ కట్టడాలను హెచ్ఎండీఏ అధికారులు కూల్చివేశారు. అనుమతులు లేని భవనాలను పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలు, కంప్రెషర్‌లతో కూల్చివేశారు. అయితే స్థానికులు అధికారులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.

Covid‌ Cases : తెలుగు రాష్ట్రాలపై కరోనా పడగ.. తిరుపతి ఐఐటీ క్యాంపస్‌ లో 100కుపైగా పాజిటివ్ కేసులు

అటు షాద్ నగర్‌లో అక్రమ కట్టడాలను హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ప్రైవేట్‌ కాలేజీ, పెద్ద భవనాలను అక్రమంగా కట్టినట్లు గుర్తించిన మున్సిపల్‌ అధికారులు.. వాటిని కూల్చివేయించారు. కొంపల్లి, తుర్కయంజాల్, నార్సింగి, శంషాబాద్, కొత్తూరు మున్సిపాలిటీల పరిధిలో 12 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. ఆ ఏరియాలో 45 అక్రమ నిర్మాణాలను గ్రేటర్ అధికారులు కూల్చివేశారు.