Holi Telangana : హోలీ రంగ హోలీ.. చమ్మకేళిల హోలీ

రంగురంగుల రంగేలీని హైదరాబాద్ వాసులే కాకుండా.. ఇతర ప్రాంతాల వాసులు ఘనంగా జరుపుకుంటున్నారు. నగరంలోని పలు సంస్థలు, హోటల్స్ హోలీ వేడుకలు జరుపుకొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.

Holi Telangana : హోలీ రంగ హోలీ.. చమ్మకేళిల హోలీ

Happy Holi

Holi Festival 2022 : దేశ వ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. హోలీ పండుగకంటే ముందు.. పలు కూడళ్లలో కామదహనం చేశారు. తన తపస్సును భగ్నం చేసిన మన్మథుడిని..ఈశ్వరుడు తన మూడో కన్ను తెరిచి ఫాల్గుణ పౌర్ణమి నాడే భస్మం చేశాడని శివపురాణం పేర్కొంటోంది. హిరణ్యకశ్యపుడి సోదరి హోలికా అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటల్లో వేసినప్పుడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు తన మహిహలతో ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. హోలికా ఆ మంటల్లో దహనమౌతుందని…దీనికి ప్రతికగా హోలీ పండుగ కంటే ముందు రోజు హోలికా బొమ్మను మంటల్లో వేసి కాముడి దహనంగా జరుపుకుంటారని చెబుతుంటారు. ఫాల్గుణ పౌర్ణమి ముందు రోజున భోగి మంటలు వేసి కాముడి బొమ్మను దహనం చేశారు. ఆనందోత్సాహాలతో కాముడి దహన వేడుకలు జరుపుకున్నారు.

Read More : Holi : రంగుల పండుగకు నగరం సిద్ధం.. జాగ్రత్తలు తీసుకోండి

రంగురంగుల రంగేలీని హైదరాబాద్ వాసులే కాకుండా.. ఇతర ప్రాంతాల వాసులు ఘనంగా జరుపుకుంటున్నారు. నగరంలోని పలు సంస్థలు, హోటల్స్ హోలీ వేడుకలు జరుపుకొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హోలీ సామగ్రీ దుకాణాలు సందడిగా మారిపోయాయి. సికింద్రాబాద్, అమీర్ పేట, దిల్ సుఖ్ నగర్, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో ఉన్న అపార్ట్ మెంట్ వాసులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని .. హోలీ పండుగను నిర్వహించుకుంటున్నారు. అయితే.. హోలీ పండుగ సందర్భంగా ఉపయోగించే రంగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరాన్ని ఎక్కువగా కప్పి ఉంచే దుస్తులు వేసుకోవాలని, కోవిడ్ జాగ్రత్తలు పాటించాలంటున్నారు. హోలీ పండుగ సందర్భంగా ప్రజలకు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. హోలీ పండుగ సోదర భావానికి ప్రతీక అని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఆమె హోలీ శుభాకాంక్షలు తెలిపారు.