Home Guard Raped SI : మహిళా ఎస్ఐ‌పై హోంగార్డు అత్యాచారం.. వీడియో తీసి రూ.50లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్

ఆర్టీఏ హోంగార్డు కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. సహ ఉద్యోగినికి మత్తుమందు కలిపిన జ్యూస్ తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు వీడియో కూడా చిత్రీకరించాడు. ఆ వీడియోని అడ్డంపెట్టుకుని బెదిరింపులకు దిగాడు. డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.

Home Guard Raped SI : మహిళా ఎస్ఐ‌పై హోంగార్డు అత్యాచారం.. వీడియో తీసి రూ.50లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్

Home Guard Raped Si

Home Guard Raped SI : హైదరాబాద్ లో ఆర్టీఏ హోంగార్డు కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. సహ ఉద్యోగినికి మత్తుమందు కలిపిన జ్యూస్ తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు వీడియో కూడా చిత్రీకరించాడు. ఆ వీడియోని అడ్డంపెట్టుకుని బెదిరింపులకు దిగాడు. డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. కొన్ని రోజులుగా హోంగార్డు తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు ఈ కీచక హోంగార్డును అరెస్ట్ చేశారు.

ఆ కీచకుడి పేరు స్వామి. ఖమ్మం ఆర్టీఏలో హోంగార్డు. అదే డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్న సహ ఉద్యోగినిని స్వామి అత్యాచారం చేశాడు. 2018లో ఖమ్మం బదిలీ అయ్యారు మహిళా ఎస్ఐ. కొత్త ప్రాంతం కావడంతో అదే డిపార్ట్ మెంట్ ల్ హోంగార్డుగా పని చేస్తున్న స్వామి ఆమెకు సాయం చేశాడు. అప్పటి నుంచి ఆమెతో పాటు ఆమె కుటుంబసభ్యులకు స్వామి దగ్గరయ్యాడు.

మత్తుమందు ఇచ్చి, నగ్నంగా వీడియోలు తీసి విద్యార్థినికి బెదిరింపులు

కాగా, ఎస్ఐ పై కన్నేసిన హోంగార్డు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మత్తుమందు కలిపిన జ్యూస్ తాగించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ మేరకు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచార దృశ్యాలను మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, లక్షల రూపాయలు వసూలు చేశాడని బాధితురాలు వాపోయింది.

Nurse Gang Raped : బెదిరించి, మద్యం తాగించి కారులో యువతిపై గ్యాంగ్ రేప్.. చెన్నైలో దారుణం

ఆ కీచక హోంగార్డు బారి నుంచి తప్పించుకోవడానికి ఎస్ఐ హైదరాబాద్ కు బదిలీపై వచ్చారు. అయినా ఆ నీచుడు ఆమెను వేధిస్తూనే ఉన్నాడు. ఏకంగా హైదరాబాద్ లో పని చేస్తున్న ఆఫీసుకి వచ్చి తోటి సిబ్బందికి వీడియోలు చూపిస్తానని, పోర్న్ సైట్ లో పెడతానని బెదిరించాడు. వీడియోలను పోర్న్ సైట్ లో పెట్టకుండా ఉండాలంటే రూ.50లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. హోంగార్డు వేధింపులు భరించలేకపోయిన ఎస్ఐ.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కీచక హోంగార్డును అరెస్ట్ చేశారు.

Madhurawada Murali Missing Case : ఆమెకు 35.. వాడికి 18.. మధురవాడ మురళి మిస్సింగ్ కేసులో షాకింగ్ నిజాలు