Nalgonda Hot Summer : అగ్నిగుండంలా న‌ల్ల‌గొండ.. దేశంలోనే అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు నమోదు

ఎండలు మండిపోతున్నాయ్. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి భగభగలతో జనం విలవిలలాడిపోతున్నారు. నల్గొండ జిల్లా అగ్నిగుండంలా...

Nalgonda Hot Summer : అగ్నిగుండంలా న‌ల్ల‌గొండ.. దేశంలోనే అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు నమోదు

Nalgonda Hot Summer

Nalgonda Hot Summer : ఎండలు మండిపోతున్నాయ్. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి భగభగలతో జనం విలవిలలాడిపోతున్నారు. అక్కడా ఇక్కడా అని లేదు.. దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి. రికార్డు స్థాయిలో ఉష్టోగ్ర‌త‌లు పెరిగిపోతుండ‌టంతో ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌టకు వచ్చే సాహసం కూడా చేయడం లేదు.

కాగా, ఏప్రిల్ నుంచి ఎండ‌లు దంచికొట్ట‌డం కామన్. కానీ మార్చిలోనే భానుడు త‌న ప్ర‌తాపాన్ని చూపుతుండటం బెంబేలెత్తిస్తోంది. ఉద‌యం 8 గంట‌ల నుంచే ఎండ‌లు మండిపోతున్నాయి. వేస‌వి కాలం ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక ముందు ముందు ఈ ఎండ‌ల తీవ్రత ఏ రేంజ్ లో ఉంటుందోనని తలుచుకుని జనం భయపడిపోతున్నారు. కాగా, వాతావరణ శాఖ ప్రకారం.. ఏప్రిల్ మొద‌టి నుంచి ఈ ఎండ‌లు మ‌రింత తీవ్రం కానున్నాయి. వ‌డ‌గాలుల ప్ర‌భావం కూడా అధికంగానే ఉండే అవ‌కాశం ఉంది.(Nalgonda Hot Summer)

Summer : వామ్మో ఎండలు.. మార్చిలోనే మాడు పగులుతోంది

తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు మాడు పగిలిపోతోంది. ఇక, తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే.. న‌ల్ల‌గొండ జిల్లా అగ్నిగుండంలా మారింది. ఈ జిల్లాలో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైన‌ట్లు ఐఎండీ వెల్ల‌డించింది. మార్చి 17వ తేదీన 43.5 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదయ్యాయి. ఇది దేశంలోనే అత్యధికం. మ‌రో 48 గంట‌ల పాటు ఈ తీవ్ర‌త కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ తెలిపింది. గ‌తేడాది మార్చిలో 37.4 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదయ్యాయి. కానీ ఈ ఏడాది మాత్రం అంత‌కు మించి ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కావ‌డంతో జ‌నాలు భ‌య‌ప‌డిపోతున్నారు.

ఆదిలాబాద్‌, రామగుండం, నిజామాబాద్‌, పెద్దపల్లి, భద్రాచలం, మెదక్‌ ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య భారత నుంచి తెలంగాణలోకి వీస్తున్న వేడి గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు ఐఎండీ తెలిపింది. ఏపీలోని కడప, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ప్రాంతాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టంగానే నమోదు అవుతున్నా.. పగటి ఉష్ణోగ్రతల్లో తీవ్రత అధికంగా ఉంటోంది. ఏటా ఏప్రిల్ రెండో వారంలో నమోదఅయ్యే గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం మార్చి నెలలోనే నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది.

Weather Report: మార్చి మొదటి వారం నుంచే “మండే ఎండలు”

ఇక ప‌శ్చిమ రాజ‌స్తాన్, హిమాచల్ ప్ర‌దేశ్, జ‌మ్మూ డివిజ‌న్‌లోని ప‌లు ప్రాంతాల్లోనూ ఎండ‌లు దంచికొడుతున్నాయి. జ‌మ్మూక‌శ్మీర్, ల‌డ‌ఖ్‌, ముజ‌ఫ‌రాబాద్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్‌, రాజ‌స్తాన్‌లోని ప‌లు ప్రాంతాల్లో సాధార‌ణం కంటే 5.1 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు అధికంగా న‌మోదు అవుతున్నాయి. గుజ‌రాత్, మ‌హారాష్ట్ర‌లోని మ‌రఠ్వాడ‌, వెస్ట్ బెంగాల్, సిక్కిం, నాగ‌లాండ్, మ‌ణిపూర్, మిజోరం, త్రిపుర‌, ఉత్త‌రాఖండ్‌, ఈస్ట్ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో సాధార‌ణ ఉష్ణోగ్ర‌త‌ల కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు అధికంగా న‌మోదు అవుతున్నట్టు ఐఎండీ తెలిపింది.

Summer : వేసవి వచ్చేసింది…జాగ్రత్తలు తప్పనిసరి!

ఈసారి ఎండలు గరిష్ఠ స్థాయిలో ఉండొచ్చని వాతావరణశాఖ నిపుణులు హెచ్చరిస్తున్న నేపధ్యంలో కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచిది. వడగాలులతో నీరసం, అలసట, తీవ్రమైన దాహం, వడదెబ్బ వంటి వాటికి గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. దీంతో రకరకాల అనారోగ్యాల బారిన పడుతుంటారు. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే జాగ్రత్తలు పాటించటం అత్యవసరం.