Telangana Hot Summer : తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఎండలతో జాగ్రత్తగా ఉండాలని సూచన

రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఎండల తీవ్రత కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే..

Telangana Hot Summer : తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఎండలతో జాగ్రత్తగా ఉండాలని సూచన

Telangana Hot Summer

Telangana Hot Summer : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వేసవిలో భానుడు భగభగ మండిపోతున్నాడు. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఎండల తీవ్రత కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఓవైపు తీవ్ర ఉక్కపోత, మరోవైపు వడదెబ్బ.. దీంతో జనాలు విలవిలలాడిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. తెలంగాణలో రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. ఎండలతో కేర్ ఫుల్ గా ఉండాలని సూచించింది. వడదెబ్బ బారిన పడకుండా, డీహైడ్రేషన్ అవకుండా జాగ్రత్తలు తీసుకోవాలంది.

ఎండల తీవ్రతపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రజలు ఎండలకు జాగ్రత్తలు వహించాలని ఆయన కోరారు. వడదెబ్బ బారిన పడకుండా డాక్టర్ల సూచన మేరకు ఆరోగ్య సూత్రాలను పాటించాలన్నారు. వడదెబ్బ తగిలితే చెమట పట్టదని, పెదాలు ఎండిపోతాయని ఆయన తెలిపారు. ఈ వేసవిలో రోజుకు 2.5 లీటర్ల నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాలన్నారు. వడదెబ్బ లక్షణాలు ఉన్న వాళ్లు ఓఆర్ఎస్ తాగాలన్నారు.(Telangana Hot Summer)

Heat Wave Alert : రోహిణి కార్తెను మించిన ఎండలు.. మరో మూడు రోజులు మంటలే మంటలు, బయటకు రావొద్దు

రాష్ట్రంలో ఎండల తీవ్రత బాగా పెరిగిందని.. రాజకీయ నాయకులు ర్యాలీలు- సభలు – సమావేశాలు సాయంత్రం లేదా ఉదయం పూట మాత్రమే పెట్టుకోవాలని డీహెచ్ శ్రీనివాస రావు సూచించారు. అలాగే నాయకుల వెంబడి వందలాది మంది ప్రజలు, కార్యకర్తలు ఉంటారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

పల్లెల్లు, గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేదు.. అన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అప్పుడే 45 డిగ్రీలకు చేరడం ఆందోళనకు గురి చేస్తోంది. సహజంగా మే నెల మధ్యలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రికార్డవుతున్నాయి.(Telangana Hot Summer)

ఇక ఎండాకాలంలో వచ్చే శారీరక సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి. ఇటు ఎండలు.. ఇటు శారీరక సమస్యలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో చర్మ సమస్యలు అత్యంత ఎక్కువగా బాధిస్తాయి. చెమట, చెమటకాయలు, తామర, వేడి గడ్డలు, వడదెబ్బ వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇక ప్రాణాలను హరించే వడదెబ్బ.. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా భయపెడుతుంది. అందుకే వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వేసవిలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. వాటిని పాటించడం ద్వారా వేసవి సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు.(Telangana Hot Summer)

Weather Update: తగ్గేదేలే అంటున్న సూర్యుడు.. మరో రెండు రోజులు వడగాలులు

* తరచుగా నీటిని తాగాలి.
* ద్రవ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.
* శర్బత్, నిమ్మరసం, మజ్జిగను ఎక్కువగా తాగాలి.
* ఎండలో బయటకు వెళ్తున్నట్లయితే.. గొడుగును వెంట తీసుకెళ్లండి, లేదా క్యాప్ పెట్టుకోండి
* ఎండ ప్రభావం చర్మంపై పడకుండా ఉండేందుకు సన్‌స్క్రీన్ లోషన్స్ వాడాలి.
* కాటన్ దుస్తులు, తెలుపు రంగు దుస్తులు వాడటం వల్ల ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందవచ్చు.
* నలుపు రంగు దుస్తులను అస్సలు ధరించొద్దు.