Hundred Snakes: ఒకే చోట వంద పాములు

పునాదులు తీస్తుంటే పురాతన వస్తువులు బయటపడటం చూసాం. ఇక మరికొన్ని చోట్ల బంగారం, వెండి వస్తువులు దొరికాయని విని ఉంటాం.

Hundred Snakes: ఒకే చోట వంద పాములు

Hundred Snakes

Hundred Snakes: ఇంటి పునాదులు తీస్తుంటే పురాతన వస్తువులు బయటపడటం చూసాం. ఇక మరికొన్ని చోట్ల బంగారం, వెండి వస్తువులు దొరికాయని విని ఉంటాం. అయితే ఇక్కడ మాత్రం ఏకంగా 100 పాము పిల్లలు బయటపడ్డాయి.

 

ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని క‌స‌ర‌బాద్ గ్రామానికి చెందిన చింత లింగయ్య అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పునాదులు తీస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ రాయిని కదిలించగా100 పాము పిల్లలు బయటపడ్డాయి.

 

విషయం తెలియడంతో గ్రామస్తులు తండోపదండలుగా వచ్చి పాము పిల్లలను చూస్తుంటారు.