పెద్దపల్లి జిల్లాలో వందల సంఖ్యలో నాటుకోళ్లు మృతి..వింతరోగమా లేదా బర్డ్ ఫ్లూ కారణమా?

పెద్దపల్లి జిల్లాలో వందల సంఖ్యలో నాటుకోళ్లు మృతి..వింతరోగమా లేదా బర్డ్ ఫ్లూ కారణమా?

Hundreds of chickens kill : దేశంలో ఒకవైపు కరోనా..మరోవైపు బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్నాయి. కరోనా మనుషులను కలవరపెడుతుంటే..బర్డ్ ఫ్లూతో పక్షులు మృత్యువాతపడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లో వందల సంఖ్యలో నాటు కోళ్లు మృతి చెందాయి. స్వామి అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిలో వందల సంఖ్యలో కోళ్లను పెంచుతున్నాడు. రోజూ లాగే ఉదయం వాటికి దాణా వేశాడు.

రెండు గంటల తర్వాత ఒకొక్కటిగా కోళ్లన్నీ చనిపోయాయి. తనకు లక్షల్లో నష్టం వాటిల్లిందని స్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే కోళ్ల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోళ్లకు వింతరోగం వచ్చిందని స్థానికులు అంటుంటే.. బర్డ్ ఫ్లూ కావొచ్చని మరికొందరు చెబుతున్నారు.