Husband Kills Wife : హైదరాబాద్‌లో దారుణం.. భార్యను చంపి ముక్కలు చేసి డ్రమ్‌లో దాచిన భర్త

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హత్య చేసిన భర్త.. మృతదేహాన్ని ముక్కలుగా చేసి.. వాటర్‌ డ్రమ్ లో దాచాడు. ఈ షాకింగ్ ఘటన..

Husband Kills Wife : హైదరాబాద్‌లో దారుణం.. భార్యను చంపి ముక్కలు చేసి డ్రమ్‌లో దాచిన భర్త

Husband Kills Wife

Husband Kills Wife : హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. భార్యను చంపిన ఓ భర్త.. మృతదేహాన్ని ముక్కలు చేసి డ్రమ్ లో దాచాడు. జూబ్లీహిల్స్‌ పరిధిలో ఈ ఘోరం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హత్య చేసిన భర్త.. మృతదేహాన్ని ముక్కలుగా చేసి.. వాటర్‌ డ్రమ్ లో దాచడం షాక్ కి గురి చేసింది.

మహబూబ్‌ నగర్‌ తండాకు చెందిన అనిల్‌, సరోజ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల క్రితం వీరి పెళ్లి జరిగింది. కొత్తలో అంతా బానే ఉంది. రోజులు గడిచే కొద్దీ మార్పు వచ్చింది. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య అనేకసార్లు వాగ్వాదం జరిగింది. ఎంతలా అంటే ప్రాణాలు తీసేంతలా.

అనిల్ దంపతుల మధ్య గొడవలు తెలిసి పెద్దలు జోక్యం చేసుకున్నారు. ఇద్దరి మధ్య రాజీకుదిర్చే ప్రయత్నం చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. శుక్రవారం సాయంత్రం కూడా ఇద్దరూ గొడవ పడినట్లు స్థానికులు పోలీసులతో చెప్పారు. ఆ తర్వాత నుంచి సరోజ ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదు. అనిల్‌ కూడా ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదు. దీంతో సరోజ తండ్రికి అనుమానం వచ్చింది.

Jubilee Hills Gang Rape Case : జూబ్లీ‌హిల్స్ గ్యాంగ్‌ రేప్ కేస్ : మరో బాలికపైనా వేధింపులు

రెహమత్‌నగర్‌ సుభాష్‌ నగర్‌లో అనిల్, సరోజ ఉంటున్న ఇంటికి సరోజ తండ్రి వచ్చాడు. బయట తాళం వేసి ఉండడంతో మరోసారి అనిల్‌కు ఫోన్ చేశాడు. ఈసారి ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన అనిల్‌.. పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. అనుమానంతో తాళం పగలగొట్టిన సరోజ తండ్రి.. లోపల దృశ్యాలు చూసి షాక్ తిన్నాడు. వాటర్‌ డ్రమ్‌లో సరోజ మృతదేహాం ముక్కలుగా కనిపించింది.

సరోజను డంబెల్‌తో కొట్టి చంపిన అనిల్.. ఆపై శవాన్ని రెండు ముక్కలుగా చేసి వాటర్‌ డ్రమ్‌లో కుక్కినట్లు పోలీసులు తెలిపారు. సరోజ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న అనిల్‌ కోసం గాలిస్తున్నారు.

ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్యను చంపిన అనిల్.. శవాన్ని రెండు రోజులుగా ఇంట్లోనే ఉంచాడు. తనకేమీ తెలియనట్లుగా రెండు రోజులు తాపీగా తిరిగాడు. కుమార్తె కోసం వచ్చిన తల్లిదండ్రులు గాలించగా.. డ్రమ్ములో సరోజ డెడ్ బాడీ కనిపించి విస్తుపోయారు. ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో 8 నెలల క్రితం సరోజను ఆమె తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. పంచాయితీ పెట్టి సర్ది చెప్పి పంపారు. తీరు మార్చుకోవాలని అనిల్ కు చెప్పారు. తన తీర్చు మార్చుకుంటానని, ఇక నుంచి అన్యోన్యంగా ఉంటామని అనిల్ పంచాయితీలో చెప్పాడు. దీంతో అతడు మారిపోయాడని నమ్మిన సరోజ తల్లిదండ్రులు.. సరోజను అనిల్ దగ్గరికి పంపారు. కొన్ని రోజులు బాగున్నారో లేదో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. అనిల్ తన తీరు మార్చుకోకపోవడంతో సరోజను ఆమె తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లిపోయారు. ఈసారి అనిల్ స్వయంగా వెళ్లాడు. సరోజ తల్లిదండ్రులతో మాట్లాడాడు. సరోజను తనతో తీసుకెళ్లాడు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత గొడవపడ్డారు. ఈ క్రమంలో సరోజను హత్య చేశాడు అనిల్.

Sexual Assault : హైదరాబాద్‌లో ఆగని అత్యాచార ఘటనలు..నగరంలో మరో రెండు దారుణాలు

సరోజ ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు అనిల్ ఇంటికి వెళ్లారు. అనిల్ ఇంటికి తాళం వేసి ఉండటం చూసి అనిల్ కు ఫోన్ చేశారు. తాను బయట ఉన్నానని అతడు చెప్పాడు. సరోజ తల్లిదండ్రులకు అనుమానం మరింత పెరిగింది. తాళం పగులగొట్టి తలుపు తెరవగానే దుర్వాసన వచ్చింది. ఇల్లంతా వెతకగా ఓ డ్రమ్ కనిపించింది. ఆ డ్రమ్ములో కుళ్లిపోయిన స్థితిలో సరోజ డెడ్ బాడీ కనిపించింది. దీంతో సరోజ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు డెడ్ బాడీని ఉస్మానియా మార్చురికీ తరలించారు.