Huzurabad By-Poll : హుజూరాబాద్ ఉప ఎన్నిక, బీజేపీ ఇన్ ఛార్జ్ ఖరారు

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇన్ ఛార్జ్‌గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని బీజేపీ పార్టీ నియమించింది. సహ ఇంఛార్జ్‌లుగా మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, యెండల లక్ష్మీనారాయణను ఎంపిక చేశారు.

Huzurabad By-Poll : హుజూరాబాద్ ఉప ఎన్నిక, బీజేపీ ఇన్ ఛార్జ్ ఖరారు

Tg Bjp

Jithender Reddy : హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై పలు పార్టీలు ఫోకస్ పెట్టాయి. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత..రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు అక్కడ మకాం వేసి వ్యూహాలు రచిస్తున్నారు.

తాజాగా..హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇన్ ఛార్జ్‌గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని బీజేపీ పార్టీ నియమించింది. సహ ఇంఛార్జ్‌లుగా మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, యెండల లక్ష్మీనారాయణను ఎంపిక చేశారు. బండి సంజయ్‌ అధ్యక్షత జరిగిన సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఈటల, తరుణ్‌ చుగ్‌తో పాటు ముఖ్య నేతల ఈ భేటికి హాజరయ్యారు. ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లాలనే దానిపై చర్చించారు.

తెలంగాణలో అవినీతి పరులు ఓడిపోతారన్నారు తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్ తరుణ్‌ చుగ్‌. రైతులను.. యువకులను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. ఈ ఎన్నికలో ఈటెల తప్పక గెలుస్తారని జోస్యం చెప్పారు తరుణ్‌ చుగ్‌. తెలంగాణలో వారసత్వ రాజకీయాలను అంతం చేస్తామన్నారు.

తెలంగాణ అమరవీరుల ఆశయాలకు విరుద్ధంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు. బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు.. పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈటల చేరికతో బీజేపీ బలపడుతుందన్న బండి సంజయ్‌.. టీఆర్‌ఎస్‌లో నిజమైన ఉద్యమకారులు లేరన్నారు.